Chittoor

News June 4, 2024

ఇంటి నుంచే ఫలితాలపై పెద్దిరెడ్డి ఆరా..!

image

చిత్తూరు జిల్లా ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.

News June 4, 2024

తిరుపతిలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూములు

image

తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 7 గంటలకు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూము తలుపులు తెరుచుకున్నాయి. పూర్తిస్థాయి సీసీ కెమెరాలు, వీడియో, ఫోటో రికార్డింగ్ నడుమ ఓపెన్ చేశారు. మరికాసేపట్లో ఈవీఎంలను ఓపెన్ చేసి ఓట్లు లెక్కిస్తారు.

News June 3, 2024

బి.కొత్తకోట: విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం

image

విద్యుత్ వైర్లు తలకు తగిలి రైతు దుర్మరణం చెందిన విషాదకర ఘటన బి.కొత్తకోట గట్టులో జరిగింది. సీఐ సూర్యనారాయణ కథనం మేరకు.. మండలంలోని గట్టు గ్రామానికి చెందిన రైతు రామస్వామి (60) రోజు మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్దకు పాడి ఆవులను తోలుకుని వెళ్లాడు. సాయంత్రం చీకటి పడుతుండడంతో ఆవులను తొలుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలోని, అయ్యవారితోపు వద్ద కరెంటు వైర్లు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

News June 3, 2024

చిత్తూరు: చిరుత సంచారం..?

image

కార్వేటినగరం: చింతమండి,ఎంఎం విలాసం(P)ల పరిధిలో చిరుత సంచరిస్తున్నట్టు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చింతమండి గ్రామానికి సమీపంలో గల పంట పొలాల్లో చిరుత సంచరించినట్టు పాద గుర్తులు గుర్తించారు. పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. రెవిన్యూ అధికారులతో పాటు అటవీ, పోలీసు అధికారులు పులి పాద ముద్రలను పరిశీలించారు. ఒంటరిగా అటవీ సమీప ప్రాంతాల్లోకి వెళ్లోద్దని హెచ్చరించారు.

News June 3, 2024

చిత్తూరు: కౌంటింగ్ ఏర్పాట్లు సమీక్షించిన ఐజి

image

ఎస్వి సెట్‌లో మంగళవారం జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లను చిత్తూరు, తిరుపతి జిల్లాల కౌంటింగ్ ఇన్చార్జి, ఐజి మోహన్ రావు సమీక్షించారు. కౌంటింగ్ గదులను అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలేజీ పరిసరాలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, మీడియా పాయింట్ పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ మణికంఠ ఉన్నారు.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్‌.. చిత్తూరు జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-4, జనసేన-1 సీటు గెలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లి, పీలేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, సత్యవేడు, గంగాధరనెల్లూరు, మదనపల్లె, పుంగనూరులో YCP గెలిచే అవకాశం ఉందని, తిరుపతిలో జనసేన గెలుస్తుందని తెలిపారు.

News June 3, 2024

చిత్తూరు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వివరాలు

image

ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో 2,712, నగరిలో 1,544, జీడీనెల్లూరులో 2,425, చిత్తూరులో 4,207, పూతలపట్టులో 3,225, పలమనేరులో 2,449, కుప్పంలో 1,579 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొదటగా వీటినే లెక్కించనున్నారు.

News June 3, 2024

పుంగనూరు: వేదవతికి ఏ కష్టం వచ్చిందో..?

image

నిన్న రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పుంగనూరు(M) భీమగానిపల్లెకు చెందిన వేదవతి మదనపల్లెకు చెందిన దస్తగిరిని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే దస్తగిరికి పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమెకు ఏ కష్టం వచ్చిందో తెలియదు. డ్యూటీలో ఉండగా నిన్న సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత డ్యూటీ గదిలోనే గన్‌తో కాల్చుకుని చనిపోయారు.

News June 3, 2024

చెవిరెడ్డి విజయం ఖాయం: ఆరా

image

గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి YCP ఒంగోలు MP అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. ఒంగోలు పరిధిలో YCP బలంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెంలో అధికార పార్టీ వేవ్ చెవిరెడ్డి విజయానికి తోడ్పడుతోందని తెలిపింది. మరోవైపు ఆయన తనయుడు చంద్రగిరి MLA అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

News June 3, 2024

తిరుపతి: 11 నుంచి కళాశాలలు ఓపెన్

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) కళాశాలలు ఈనెల 11వ తేదీ నుంచి పునః ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 10వ తేదీ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని వెల్లడించారు.