India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్ మీర్‌పేటలో తప్పిపోయిన బాలుడు మహీధర్ రెడ్డి(13) ఆచూకీ లభ్యమైంది. బాలుడు తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. పేరెంట్స్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో దొరికిన ఫుటేజ్ ద్వారా బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

డెంగ్యూతో ఏడో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పుంగనూరులో సోమవారం చోటుచేసుకుంది. సోమల మండలం నంజంపేట పంచాయతీ ఇర్లపేటకు చెందిన వెంకటరమణ, ఈశ్వరమ్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (11) పట్టణ పరిధిలోని మేలుపట్ల గిరిజన వసతిగృహంలో ఏడో తరగతి చదువుతోంది. తీవ్ర జ్వరం రావడంతో జులై 27న ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో దేవరాజు తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోగా ఉండాలన్నారు. పరీక్ష డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు చెప్పారు.

108లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏఈఎంఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎలీ, బి.ఫార్మసీ, డీఎంఎల్ పూర్తి చేసి ఉండాలని, పైలట్ కి పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

సంతపేట PNC మున్సిపల్ స్కూల్ క్రీడా మైదానంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటుకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ త్రిసభ్య కమిటీ, MEO సెల్వరాజ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కమిటీ సభ్యులు ఆర్డీవో చిన్నయ్య మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణుడు, తహశీల్దార్ కళావతి, హైస్కూల్ హెచ్ఎం వేద కుమారి పాల్గొన్నారు.

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది (PG) M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

జిల్లాలోని 7 అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO T.పద్మజ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు అర్హులైన వారు గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందజేయాలన్నారు. B.Edతో పాటు TET అర్హత సాధించిన వాళ్లు అర్హులు. ఈనెల 6న చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు డెమో క్లాసు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.

తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తులు డైరెక్ట్ క్యూ లైన్‌లో వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాగా ఆదివారం 75,356 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో మదనపల్లె విద్యార్థులు సత్తా చాటి బ్లాక్ బెల్ట్ సాధించినట్లు మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేశ్ తెలిపారు. విద్యార్థులు మహేశ్వర్, షేక్ మిస్బా, జోషితారెడ్డి , మహమ్మద్ ఐమాన్ , మోహిబుల్ రెహమాన్, విశిష్టసాయి , కాలేషామస్తాన్ , చారుకేశరాయల్ , ప్రజ్వల్ రాయల్ బ్లాక్ బెల్ట్ సాధించారన్నారు. వారంతా ఆదివారం మదనపల్లెకు రావడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.