Chittoor

News April 3, 2024

తిరుపతి: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నర్సింగ్ ప్రాక్టీషనర్-01, వార్డు అసిస్టెంట్-01 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 08.

News April 3, 2024

43 శాతం సామాజిక ఫించన్ పంపిణీ పూర్తి

image

తిరుపతి జిల్లాలో గురువారం సామాజిక ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏప్రిల్ మాసంకు గాను జిల్లా వ్యాప్తంగా 2,71,477 సామాజిక భద్రత పెన్షనర్లకు సచివాలయాల పరిధిలో సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 (43%) పెన్షన్ల పంపిణీ జరిగిందని జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన వారికి సైతం శుక్రవారం కూడా పంపిణీ చేస్తామని వివరించారు.

News April 3, 2024

పూతలపట్టులో ముగిసిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ సభ

image

పూతలపట్టులో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ సభ ముగిసింది. సభ వేదికపై సీఎం జగన్ ప్రతిపక్షలపై విమర్శలు చేశారు. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులను పరిచయం చేశారు. అనంతరం బస్సు యాత్ర పి.కొత్తకోట, పాకల క్రాస్, గదంకి, పనపాకం, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్ రేణిగుంట మీదుగా గురవరాజుపల్లె చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు.

News April 3, 2024

TPT: క్రీడలపట్ల అవగాహన కల్పించిన భారత కెప్టెన్

image

భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రజని టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు క్రీడలకు సంబంధించి అవగాహన కల్పించారు. దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ముస్తాక్ అహ్మద్ ఆహ్వానం మేరకు బుధవారం ఆర్ట్స్ కళాశాలకు విచ్చేశారు. క్రమశిక్షణతో చేసే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు అని ఆమె విద్యార్థులకు తెలియజేశారు. క్రీడాకారులకు 20 హాకీ స్టిక్స్ బహుమతిగా అందజేశారు.

News April 3, 2024

తిరుపతి: ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య

image

తిరుపతిలో ఇండియా కూటమి పార్లమెంటు అభ్యర్థిగా డాక్టర్ అంజయ్య పోటీ చేయనున్నట్లు బుధవారం స్పష్టం చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ప్రజలు తనకు ఒక అవకాశం ఇస్తే పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతియుత, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తామన్నారు.

News April 3, 2024

టీడీపీ నేతకు కండువా కప్పిన CM జగన్

image

చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన టీడీపీ నేత, జడ్పీ మాజీ ఛైర్మన్ ఎం.సుబ్రహ్మణ్యం నాయుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సీఎం జగన్ బస చేసిన అమ్మగారిపల్లె వద్దకు వెళ్లారు. జగన్ ఆయనకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్యం నాయుడితో పాటు మరికొందరు ఫ్యాన్ గూటికి చేరారు.

News April 3, 2024

చిత్తూరు జిల్లాలో CM పర్యటన ఇలా..!

image

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చిత్తూరు జిల్లాలోకి నేడు ప్రవేశించనుంది. జిల్లాలోని పూతలపట్టు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం పాకాల మండలం గాదంకి మీదుగా ముంగళిపట్టు, మామండూరు, ఐతేపల్లి, తిరుపతి మీదుగా రేణిగుంటకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

News April 3, 2024

చిత్తూరు: నాలుగు రోజుల్లో పెన్షన్ ప్రక్రియ పూర్తి చేయండి

image

జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పెన్షన్ ల పంపిణీ ఈ నెల 3 వ తేదీ నుంచి 6 వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందిని ఎంపిక చేసి ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.

News April 2, 2024

పిచ్చాటూరు: కన్నతల్లిని గొంతు కోసిన కసాయి కొడుకు

image

ఆస్తి తగాదాలతో కన్నతల్లి గొంతు కోసి చంపిన ఘటన పిచ్చాటూరు మండలంలోని అడవి కొడియంబేడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. రాజమ్మ (80) రెండో కొడుకు కృష్ణారెడ్డి, అతని కొడుకులు కలిసి రాజమ్మతో గొడవ పడి గొంతు కోసి చంపి పరారైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News April 2, 2024

మదనపల్లెలో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ

image

మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమం ముగిసింది. ఈ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపైన మాట్లాడారు. అనంతరం వైసీపీ అభ్యర్థులను స్టేజీపైన ప్రకటించి వారిని గెలిపించాలని కోరారు. ఆయన సభ ముగిసిన తర్వాత నిమ్మనపల్లె క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. అమ్మగారిపల్లెలో రాత్రి బసచేయనున్నారు.

error: Content is protected !!