Chittoor

News March 28, 2024

తిరుమల: 4 నుంచి అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు

image

తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు జరగనుంది. తాళ్లపాకలోని ధ్యానమందిరం, తిరుమల నారాయణగిరి ఉద్యానవనం, తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 4న తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 5న తిరుమలలో నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహిస్తారు.

News March 28, 2024

నాగబాబుతో తిరుపతి అభ్యర్థిపై చర్చ..!

image

జనసేన తిరుపతి MLA అభ్యర్థి శ్రీనివాసులును వ్యతిరేకిస్తున్న ఆపార్టీ స్థానిక ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మంగళగిరిలో నాగబాబును గురువారం కలిశారు. తిరుపతిలో తాజా పరిస్థితులను ఆయనకు వివరించారు. త్వరలో తిరుపతిలో పవన్ పర్యటన ఉంటుందని.. ఈ లోపు పరిస్థితులు అంతా చక్కదిద్దుకుంటాయని నాగబాబు ఆయనకు సూచించారు. ఎన్నికల్లో తనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని నాగబాబును కోరగా.. అందుకు ఆయన అంగీకారం తెలిపారని కిరణ్ రాయల్ చెప్పారు.

News March 28, 2024

2న శ్రీవారి ఆలయంలో తిరుమంజనం

image

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 9న ఉగాది ఆస్థానం జరగనుంది. ఈక్రమంలో ఏప్రిల్‌ 2వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వ‌చ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించ‌డం ఆనవాయితీగా వస్తోంది.

News March 28, 2024

‘నగరిలో రోజా ఓడిపోతారు’

image

నగరిలో రోజాకు అసమ్మతి నేతల తలనొప్పి తగ్గడం లేదు. YCP పెద్దల పిలుపుతో 5 మండలాల నాయకులు అమరావతి వెళ్లారు. రోజా కోసం అందరూ కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలు సూచించారు. ‘మేము వద్దన్నా రోజాకు టికెట్ ఇచ్చారు. అందరూ కలిసి పని చేసినా ఆమె ఓడిపోతారు. తర్వాత మేమే ఓడించాం అని ఆమె ప్రచారం చేస్తారు. ఆ నిందలు మాకెందుకు’ అని నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. తర్వాత వారికి రోజా నమస్కారం చేసినా నేతలు ముఖం చాటేశారు.

News March 28, 2024

పుంగనూరు: 1 నుంచి ఉపాధి కూలీ రూ:300

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు గరిష్టంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.300 వేతనం అందేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ శన్మోహన్ తెలిపారు. కూలీలు పనిచేసిన పని పరిమాణాన్ని 300 రూపాయలకు మించకుండా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వందరోజుల పనిదినాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

News March 28, 2024

తిరుమల కాలినడక మార్గంలో చిరుత కలకలం

image

తిరుమల కాలినడక మార్గంలో మరోసారి చిరుత కదలికలు టీటీడీ, ఫారెస్ట్ అధికారుల మధ్య కలకలం సృష్టించింది. ఈనెల 25, 26 వ తేదీలలో కాలినడక మార్గంలో చిరుత జాడలను గుర్తించినట్లు టీటీడీ ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాలినడకన మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను గుంపులుగా అనుమతిస్తున్నారు.

News March 28, 2024

చిత్తూరు: హైవేపై రోడ్డు ప్రమాదం

image

తవణంపల్లి మండలం, K పట్నం 140 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగం కంట్రోల్ కాక లారీని కారు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి బెంగళూరుకు చెందిన మహేశ్‌గా గుర్తించి వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News March 28, 2024

తిరుపతిలో టీడీపీ నేత ఇంట్లో సోదాలు

image

తిరుపతిలో టీడీపీ నేత కోడూరు బాలసుబ్రమణ్యం ఇంట్లో 15 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఏమీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఆయన మాట్లాడుతూ.. 15 మంది అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం బాధాకరమన్నారు. తమ లాంటి వ్యక్తులపైనే దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

News March 27, 2024

ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం తగదు: చెవిరెడ్డి

image

వైసీపీ అధికారికంగా కొనుగోలు చేసిన ప్రచార సామగ్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల నిమిత‍్తం పార్టీకి అవసరమైన సామగ్రిని 2023 అక్టోబర్‌ నుంచి 2024 మార్చి 14వ తేదీ వరకు వివిధ తేదీల్లో పలు సంస్థల నుంచి జీఎస్‌టీ చెల్లించి మరీ కొనుగోలు చేసినట్లు చెప్పారు.

News March 27, 2024

కాంగ్రెస్‌లో చేరిన డిప్యూటీ సీఎం మేనల్లుడు

image

డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మేనల్లుడు డి.రమేష్ బాబు వైసీపీని వీడారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగతానని చెప్పారు.

error: Content is protected !!