India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాతే EVMలు లెక్కిస్తామని.. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ ఉండదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో 4 చోట్ల రీపోలింగ్ జరిపించాలని చెవిరెడ్డి కోరిన విషయం తెలిసిందే.

కుప్పం మాజీ ఎమ్మెల్యే వెంకటేశం కుమారుడు డీవీ చంద్రశేఖర్(72) కన్నుమూశారు. నిన్న రాత్రి 12:20 గంటలకు ఆయన స్వగ్రామం గుండ్ల సాగరంలో అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1967, 1972లో వరుసగా రెండుసార్లు వెంకటేశం కుప్పం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాజలూరి గ్రామానికి చెందిన బాలాజీ (24) మనస్తాపంతో ఉరేసుకుని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

పూతలపట్టు మండలం ఎస్.వి సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములలో కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులుతో కలిసి ఎస్.వి.సెట్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత చేసినట్లు చెప్పారు.

చంద్రగిరి సమీపంలో ఐతేపల్లి వద్ద నిన్న ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు <<13272611>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. మృతుడు రేణిగుంట మండలం ఆర్.మల్లవరానికి చెందిన సందీప్‌గా గుర్తించారు. తల్లిదండ్రుల కోరిక మేరకు అమెరికాలో ఉద్యోగం మానేసి బెంగళూరుకు వచ్చి సాప్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు. పెళ్లిచూపులు ఉన్నాయని తల్లిదండ్రులు చెప్పడంతో కారులో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొనడంతో చనిపోయాడు.

చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ జరిపించాలని MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న తిరుపతి కలెక్టర్‌ను కలిశారు. పాకాల మండలం నేలదానిపల్లి, రామచంద్రాపురం మండలం చిన్నరామాపురం, చంద్రగిరి మండలం ఎగువ కాశిపెంట్ల, కల్ రోడ్డ్ పల్లిలో తిరిగి ఎన్నికల్లు నిర్వహించాలని కోరారు. పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల తరఫున ఫిర్యాదులు లేకపోవడంతో తాము ఏమీ చేయలేమని కలెక్టర్ చెప్పారని సమాచారం.

చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ముందు వెళుతున్న లారీని కారు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆర్ మల్లవరానికి చెందిన సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

పోలింగ్ విధులకు హాజరు కాని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పోలింగ్ విధులకు 228 మంది పీఓ, ఏపీఓ, ఓపీఓలు హాజరు కాలేదన్నారు.

తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది వరకు ఇక్కడ ఎస్పీగా పని చేసిన కృష్ణ కాంత్ పటేల్ తిరుపతి స్ట్రాంగ్ రూముల వద్ద జరిగిన గొడవను అదుపు చేయడంలో విఫలం అయ్యారంటూ ఆయన్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త ఎస్పీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

సెలవుల్లో ఊరికి పంపలేదని ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన తంబళ్లపల్లెలో చోటుచేసుకుంది. మండలంలోని బలకవారిపల్లె హరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు బి.శ్రీరాములు(15) కురబలకోటలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో వాల్మీకి పురంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని కోరగా ఇంట్లో ఒప్పుకోలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.