Chittoor

News March 27, 2024

తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు ఇవే

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్‌లో జ‌రగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాలు ఇలా ఉంటాయి. 5న శ్రీ అన్న‌మాచార్య వ‌ర్ధంతి, 7న మాస‌ శివ‌రాత్రి, 8న స‌ర్వ అమావాస్య‌ పూజలు చేశారు. 9న శ్రీక్రోధినామ సంవ‌త్స‌ర ఉగాది, శ్రీ‌వారి ఆల‌యంలో ఉగాది ఆస్థానం, 11న మ‌త్స్య‌జ‌యంతి జరుగుతుంది. 17న శ్రీ‌రామ‌న‌వ‌మి ఆస్థానం, 18న శ్రీ‌రామప‌ట్టాభిషేక ఆస్థానం, 19న స‌ర్వ ఏకాద‌శి, 21 నుంచి 23వ తేదీ వ‌ర‌కు వ‌సంతోత్స‌వాలు నిర్వహిస్తారు.

News March 26, 2024

వైసీపీలో చేరిన గంటా నరహరి

image

జనసేన నేత గంటా నరహరి వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌గా పని చేసిన ఆయన ఈనెల 13న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఆయన తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నరహరితో చర్చించారు. ఇవాళ CM క్యాంప్ కార్యాలయంలో జగన్ సమక్షంలో YCP తీర్థం పుచ్చుకున్నారు.

News March 26, 2024

హంద్రీనీవాను పరిశీలించిన చంద్రబాబు

image

రామకుప్పం వద్ద హంద్రీనీవా కాలువను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పానికి నీళ్లు రావడం గ్రాఫిక్స్‌లా ఉందన్నారు. ఉత్తుత్తి ముఖ్యమంత్రి బటన్ నొక్కగానే కనిపించిన నీరు ఇప్పుడు కనబడటం లేదని విమర్శించారు. మరి ఇంత మోసమా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడిందని హంద్రీనీవా నీళ్లు ఇచ్చినట్లు షో చేశారని మండిపడ్డారు.

News March 26, 2024

వాలంటీర్లకు రూ.50వేలు వచ్చేలా చూస్తా: CBN

image

ఏపీని కాపాడాలన్న అజెండాతోనే మూడు పార్టీలు కలిసి ప్రజల ముందుకు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో ఆయన సమావేశమయ్యారు. ‘ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించా. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తాం. వాలంటీర్లు రూ.30 వేల నుంచి రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తా’ అని చంద్రబాబు తెలిపారు.

News March 26, 2024

తిరుపతి: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసిన ఘటన సోమవారం చిన్నగొట్టిగల్లు మండలంలో చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం అలసిపోయిన తల్లి గుడిసెలో నిద్రిస్తుండగా అదే ఇటుకల బట్టీలో పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన వేలు అనే యువకుడు చిన్నారిని పక్కనే ఉన్న గుడిసెలోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. అంతలో తల్లి నిద్ర లేచి గుడిసెలోకి వెళ్లి చూడగా నిందితుడు పారిపోయాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News March 26, 2024

చంద్రగిరి: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి
మృతి చెందిన ఘటన తొండవాడ సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఝార్ఖండ్ కు చెందిన రహదేవ్ సింగ్(26) చంద్రగిరిలో కూలీగా పనిచేస్తున్నాడు. ద్విచక్ర వాహనంలో వస్తుండగా పెట్రోల్ లేకపోవడంతో ఆగిపోయింది. దీంతో రహదేవ్ సింగ్ పెట్రోల్ పట్టించుకునేందుకు రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

News March 26, 2024

నేడు తిరుమలకు చిరంజీవి, రామ్ చరణ్

image

ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి మంగళవారం తిరుమలకు రానున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరి రాత్రి బస చేయనున్నారు. బుధవారం రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. విమానాశ్రయానికి అభిమానులు చేరుకోవాలని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు ప్రభాకర్ కోరారు.

News March 26, 2024

ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు

image

కుప్పంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కుప్పం పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. బాబు నగర్ వద్దనున్న మసీదులో చంద్రబాబు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

News March 25, 2024

YCPలోకి చిత్తూరు ZP మాజీ ఛైర్మన్

image

చిత్తూరు జడ్పీ మాజీ ఛైర్మన్ సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీలో చేరారు. ఆయనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. సుబ్రహ్మణ్య రెడ్డి 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ కుప్పం రెస్కో ఛైర్మన్ సెంథిల్ కుమార్‌తో కలిసి వైసీపీలో చేరారు.

News March 25, 2024

తిరుపతి: టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు

image

తిరుపతి ఐజర్(IISER)లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2 ఖాళీలు ఉన్నాయి. పీజీ ఇన్ లైఫ్ సైన్స్ చదివి రెండేళ్ల అనుభవం కలిగిన వాళ్లు అర్హులు. మరిన్ని వివరాలకు www.iisertirupati.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 03.

error: Content is protected !!