Chittoor

News May 17, 2024

చిత్తూరు: తన బిడ్డలను కాపాడమని అందరి కాళ్లు పట్టుకున్న తల్లి

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి గురువారం ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి తల్లి రోధిస్తున్న తీరు అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. తన పిల్లలు చనిపోలేదంటూ..వారిని ఆసుపత్రికి తీసుకెళ్లండి అంటూ అందిరి కాళ్లూ పట్టుకుంటున్న వైనం హృదయాలని కలచివేస్తోంది. తమకింకెవరూ లేరు అంటూ తామూ చనిపోతామని గుండెలను బాదుకుంది.

News May 17, 2024

తిరుపతి వర్సిటీ ఘటన.. SPతో పాటు నలుగురిపై వేటు

image

తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో జరిగిన ఘటనను ఈసీ తీవ్రంగా పరిగణించింది. SPని బదిలీ చేయడంతో పాటు నలుగురిపై వేటు వేసింది. తిరుపతి DSP సురేంద్ర రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ తిరుపతి DSP భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కె.రాజశేఖర్, అలిపిరి CI ఓ. రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీలో జరిగిన దుండగుల దాడిలో పులివర్తి నానికి గాయాలైన విషయం తెలిసిందే.

News May 17, 2024

తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు

image

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్‌ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

News May 16, 2024

తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటు

image

ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసపై సీఈసీ సీరియస్‌ అయ్యింది. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌పై బదిలీ వేటువేసింది. డీఎస్పీతో పాటు తిరుపతిలోని పలువురు సబార్డినేట్ అధికారులపైనా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఫలితాల వేళ కూడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

News May 16, 2024

చిత్తూరు: చెరువులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి

image

వడమాలపేట మండలం గూళూరు చెరువులో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్లు గురువారం మృతి చెందారు. మృతులు ముగ్గురూ ఎస్‌బిఆర్‌ పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకోవడానికి దిగారు. ప్రమాదావశాత్తు ఒక్కరు నీటిలో పడిపోయారు. వీరిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు పడి మృత్యువాత పడ్డారు.

News May 16, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో టెన్త్ హాల్ టికెట్లు

image

పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని డీఈఓ డాక్టర్ వి.శేఖర్ తెలిపారు. హాల్ టికెట్లను సంబంధిత పాఠశాలలో కానీ www.bse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను పొందవచ్చని డీఈఓ చెప్పారు.

News May 16, 2024

TPT: లక్ష మందికిపైగా ఓటింగ్‌కు దూరం

image

రాష్ట్రంలోనే అత్యల్పంగా తిరుపతిలో పోలింగ్ జరిగింది. 2019లో 65.93 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 2.61 శాతం తగ్గడంతో పోలింగ్ పర్సంటేజీ 63.32కి పరిమితమైంది. తిరుపతి నియోజకవర్గంలో మొత్తం 3,02,503 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,91,557 మంది మాత్రమే ఓటు వేశారు. 1,10,946 మంది ఓటింగ్ దూరంగా ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యంగం కల్పించిన హక్కును వినియోగించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

News May 16, 2024

చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్

image

చిత్తూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తునట్లు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 14వ తేది సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఒకే చోట ఎక్కువ మంది గుమికూడటం, డ్రోన్లు ఎగరవేయడం, సమావేశాల నిర్వహణ నిషేధమని తెలిపారు. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.

News May 16, 2024

TPT:21న సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (IISER) తిరుపతి నందు ఈనెల 21వ తేదీన సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాస్టర్స్ డిగ్రీ నేచురల్/ అగ్రికల్చరల్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News May 15, 2024

విజయపురం: శతాధిక వృద్ధురాలు మృతి

image

విజయపురం మండల కేంద్రంలో శతాధిక వృద్ధురాలు ఆర్. వెంకటమ్మ (111) బుధవారం మృతి చెందారు. ఈమె మృతి చెందే వరకు తన పనులు తానే చేసుకుంటూ ఆరోగ్యంతో జీవనం ముందుకు సాగించారు. శతాధిక వృద్ధురాలి కుమార్తె వయస్సు 85 సంవత్సరాలు కావడం విశేషం. ఈమె 2024 సంవత్సరం సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోంచుకుంది.