India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చంద్రబాబు ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వెళ్తున్న టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని కారు ప్రమాదానికి గురైంది. గుంటూరు వద్ద కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పులివర్తి నానితో పాటు కారులో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఏమి కాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 2, 3, 4వ తేదీల్లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంత్రి నివాసంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమావేశం అనంతరం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. 2న పీలేరు, 3న చిత్తూరు జిల్లాలో బస్సు యాత్ర, నాయకులతో సమావేశం, 4న తిరుపతి జిల్లాలో బస్సు యాత్ర.. శ్రీకాళహస్తి లేదా నాయుడుపేటలో నాయకులతో సమావేశం జరుగుతుందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 25న సోమవారం జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని స్థానిక నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం 10గంటలకు హెలికాప్టర్‌లో పీఈఏస్ వైద్య కళాశాలకు ఆయన చేరుకుంటారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మహిళలతో ముఖాముఖి అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన పలువురు నాయకులను కలిసి మద్దతు కోరారు. ఆ మరుసటి రోజు టీడీపీ, జనసేన అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు ఎస్సీవీ నాయుడు సైతం తాను సుధీర్ రెడ్డికి మద్దతు ఇవ్వలేదని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో కూటమి సహకారం లేకుండా విజయావకాశాలు తక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మండలంలోని పెనుమల్లం, రావిళ్లవారి కండ్రిగకు చెందిన ఇద్దరు వాలంటీర్లను శుక్రవారం విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీవో గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించగా వాలంటీర్లు లత, గీత, ఆర్టీసీ కండక్టర్ మురళి పాల్గొన్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో వాలంటీర్లను తొలగించడంతో పాటు మురళిపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికల ప్రచారానికి మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరి అని చిత్తూరు కలెక్టర్ షన్మోహన్ అన్నారు. మీడియాలో వచ్చే ఎన్నికల ప్రచారం నిబంధనలకు లోబడి ఉందా లేదా అని పరిశీలించి ఫ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తులను వరుస క్రమం ప్రకారం అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఓ కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు మహిళలు ఒక్కసారి కూడా గెలవ లేదు. అందులో చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కూడా ఉండటం విశేషం. అలాగే పూతలపట్టు, జీడీనెల్లూరు, శ్రీకాళహస్తిలో ఇంత వరకు మహిళలు గెలవ లేదు. మరోవైపు గళ్లా అరుణకుమారి, రోజా, గుమ్మడి కుతుహలమ్మ వంటి నేతలు మంత్రులుగా పని చేశారు.
కుప్పం మండలం బురడ సిద్దనపల్లి గ్రామంలో శుక్రవారం విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మురుగేష్ కుమారుడు రాజశేఖర్ ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. మద్యాహ్నం మేకలకు మేత కోసం వెళ్లినప్పుడు పొలం వద్ద కిందకు వేలాడుతున్న కరెంటు తీగలు పొరపాటున తగిలి రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ పరిధిలో పుట్టగొడుగుల పెంపకం, సేంద్రియ వ్యవసాయంపై తెలుగు మీడియం ద్వారా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. ఆసక్తి కలిగిన యువత, రైతులు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు angrau.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
మాజీ సీఎం చంద్రబాబు
ఈనెల 27 నుంచి 31 వరకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. సంబంధత పర్యటన వివరాలను టీడీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, మదనపల్లెలో ఎన్నికల ప్రచారం చేస్తారు. 28న అనంతపురం, శ్రీసత్యసాయి, 29న కర్నూలు, నంద్యాల, 30న కడప, తిరుపతిలో, 31న నెల్లూరు, ఒంగోలులో ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.