India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) నందు గురువారం ఉదయం 10 గంటలకు రీసర్చ్ అసోసియేట్ (మెడికల్/పారామెడికల్) పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. MSC నర్సింగ్, MPT న్యూరో, MSC న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs వెబ్ సైట్ చూడాలని సూచించారు.

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూలై 21వ తేదీ ఆదివారం 6వ కాన్వొకేషన్ (Convocation) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థులు 20వ తేదీ హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

తంబళ్లపల్లె MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వదంతులు వచ్చాయి. అదంతా అవాస్తవమని వైసీపీ నేత నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు. ‘చిన్నపాటి అనారోగ్యంతో బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నేను నిన్న MLAను కలిశా. 6, 7వ తేదీల్లో ఎమ్మెల్యే స్వగ్రామం యర్రాతివారిపల్లెలో అయ్యప్ప మాలదీక్ష తీసుకుంటారు’ అని ఆయన చెప్పారు.

శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేశారని, దిట్టం పెంచారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై TTD స్పందించింది. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ఇటువంటి వార్తలు నమ్మవద్దు. ఈవో శ్యామలారావు మొన్న అర్చకస్వాములు, ఆలయ అధికారులతో సమావేశమయ్యారు. స్వామివారికి నివేదించే అన్న ప్రసాదాలపై చర్చించారు. కానీ ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదు’ అని TTD స్పష్టం చేసింది.

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం అయ్యవార్లగొల్లపల్లెలో కేశవ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘కేశవ తల్లికి పింఛన్ ఆపేసి టీడీపీ నాయకులు వేధించారు. అతి తట్టుకోలేకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. పెన్షన్ అడిగిన కొడుకును టీడీపీ బలితీసుకుంది’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కడుపు నొప్పి భరించలేక తన సోదరుడు పురుగు మందు తాగాడని కేశవ అన్న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తిరుపతిలోని స్టడీ సర్కిల్లో డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ, సాధికారత అధికారి రబ్బానీబాషా వెల్లడించారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు అర్హులని చెప్పారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈనెల 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్‌ను సంప్రదించాలని కోరారు.

కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో మంగళవారం ట్రైనింగ్ సెంటర్లో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అవగాహన కల్పించాలన్నారు. అక్రమ రవాణా నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.

శ్రీకాళహస్తి: తొండమనాడు మార్గం అమ్మపాళెం సమీపంలో ఓ మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కుని ఇద్దరు దుండగులు పరారైన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. అమ్మపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళ వాకింగ్ చేస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు బైక్‌పై వచ్చి మహిళ మెడలోని తాళిబొట్టు లాక్కొని పరారయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్లే భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని TTD ఈవో శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ అటవీ,TTDఅటవీ,ఇంజనీరింగ్,భద్రత విభాగాలతో ఈవో సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న ట్రాప్ కెమెరాలే కాకుండా చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకొనేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.

తిరుపతి జిల్లా కలెక్టర్ ధ్యాన చంద్ర బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.వెంకటేశ్వర్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన తిరుపతి కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Sorry, no posts matched your criteria.