Chittoor

News May 9, 2024

ముదివేడు వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద గురువారం రాత్రి టిప్పర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి కథనం.. ముదివేడు గ్రామం, సాయిబులపల్లెకు చెందిన మహబూబ్ బాషా(35), సొంత పనిపై ముదివేడు క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితుణ్ని మదనపల్లెకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉందని ఎస్ఐ తెలిపారు.

News May 9, 2024

తిరుపతి: ITIలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు తిరుపతి ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీలక్ష్మీ వెల్లడించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులన్నారు. iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.

News May 9, 2024

చిత్తూరు: ఎన్నికల విధులపై అవగాహన

image

చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్‌లో ట్రైనీ ఐపీఎస్‌లకు ఎస్పీ మణికంఠ, ప్రొబెషనరీ డీఎస్పీ పావన్ కుమార్ ఎన్నికల విధులపై గురువారం అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ గురించి వివరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పారు. వాహనాల తనిఖీ, నగదు రవాణా అరికట్టడం, పోలింగ్ స్టేషన్ల నిర్వహణ అంశాలను వివరించారు.

News May 9, 2024

ఫేక్ ఓటర్లపై క్రిమినల్ కేసు పెడతాం: అదితిసింగ్

image

తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా సంఘటనలపై ఈసీ కఠిన చర్యలు తీసుకుని పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో తాజా ఎన్నికలపై తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిణి అదితిసింగ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలంతా నిర్భయంగా ఓటు వేయాలని కోరారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఫేక్ ఓటరని గుర్తిస్తే.. సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

News May 9, 2024

చిత్తూరు: ఫీజు గడువు పెంపు

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు తేదీని ఇంటర్ విద్యామండలి శుక్రవారం వరకు పొడిగించింది. ఈ మేరకు మండలి తిరుపతి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు తత్కాల్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు బుధవారంతో గడువు ముగియగా, రెండు రోజులు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు.

News May 9, 2024

చిత్తూరు: జోరుగా నగదు పంపిణీ?

image

ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నాయకులు ఓటర్లను జోరుగా ప్రభావితం చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న ఓటర్లను రప్పించడానికి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు నిన్న కలికిరిలో మోదీ సభ జరగడంతో పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన పలు పార్టీలు జోరుగా నగదు పంపిణీ చేశాయని సమాచారం. మీ ఏరియాలో ఓటుకు డబ్బు ఇచ్చారో లేదో కామెంట్ చేయండి.

News May 9, 2024

13న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఈనెల 13న తిరుపతి స్విమ్స్‌లో ఓపీ, ఓటీలకు సెలవు ప్రకటించారు. వైద్యులు, సిబ్బంది, రోగులు ఓటుహక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ఇచ్చారు. ఆరోజు అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంచాలకులు డా.ఆర్వీ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

News May 9, 2024

అలా అయితే మాకు ఓట్లేయకండి: మిథున్ రెడ్డి

image

కేవలం రూ.30 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న శివశక్తి డెయిరీపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేయడం తగదని మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పుంగనూరులో హెరిటేజ్‌తో పాటు అన్ని కంపెనీల డెయిరీలు పాలు సేకరిస్తున్నాయి. పాడి, మామిడి రైతులకు మా నుంచి ఇబ్బందులు ఎదురై ఉంటే ఎన్నికల్లో మాకు ఓట్లు వేయకండి’ అని మిథున్ రెడ్డి సూచించారు.

News May 9, 2024

చిత్తూరు: మోదీ సభకు వెళ్లి వస్తుండగా మృతి

image

పీలేరు నియోజకవర్గం కలికిరిలో ప్రధాని మోదీ సభకు వెళ్లి వస్తున్న ఓ వ్యక్తి చనిపోయాడు. కేవీపల్లె మండలం తిమ్మాపురానికి చెందిన షేక్ జాఫర్(40), అప్జల్, వారాధి, షఫీ ఆటోలో మోదీ సభకు వెళ్లారు. తిరిగి వస్తూ సభలో ఐరన్ పైపులకు ఏర్పాటు చేసిన జెండాలు తీసుకున్నారు. వాటిని ఆటోకు కట్టారు. సభా ప్రాంగణ సమీపంలో అందులోని ఓ జెండా కరెంట్ వైర్లకు తగిలింది. జాఫర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.

News May 9, 2024

తిరుపతి: ఈరోజు వరకు అవకాశం: కలెక్టర్

image

తిరుపతి జిల్లాలోని 7-అసెంబ్లీ స్థానాలలో, ఇతర జిల్లా ఓటర్ల కొరకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు 9మే మధ్యాహ్నం వరకు నిర్వహించబడునని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం మే 9వ తేదీన మధ్యాహ్నం వరకు తిరుపతి SVU క్యాంపస్ హైస్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోగలరని కలెక్టర్ తెలిపారు.