Chittoor

News May 1, 2024

తిరుపతి: మే 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

image

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం మే 3వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 నుంచి10 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వంలోని మీటింగ్ హాల్‌లో జరుగనుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డికి ఫోన్‌ ద్వారా నేరుగా తెలపవచ్చు అన్నారు.

News May 1, 2024

మదనపల్లెలో రియల్టర్‌పై కొడవలి, కత్తులతో దాడి

image

మదనపల్లెలో రియల్టర్ శ్రీనివాసులు రెడ్డిపై ప్రత్యర్థులు కొడవలి, కత్తులతో పట్టపగలే హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి  కుటుంబీకులు కథనం.. స్థానిక సీపీఎం రోడ్డు, ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉంటున్న రమణారెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డిలు శ్రీనివాసులు రెడ్డిపై కత్తులు కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. హత్యాయత్యానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

News May 1, 2024

రామచంద్ర యాదవ్‌పై హత్యాయత్నం కేసు

image

చిత్తూరు జిల్లా సదుం మండలంలో జరిగిన అల్లర్ల కేసులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌తో పాటు 13 మందిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మారుతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కట్టారు. అలాగే గ్రామంలోకి అనుమతి లేకుండా వెళ్ల వద్దని పోలీసులు సూచించినా.. లెక్కచేయకుండా వెళ్లడంతో రామచంద్ర యాదవ్‌తో పాటు పలువురిపై మరో కేసు నమోదు చేశారు.

News April 30, 2024

ఏడు చోట్ల టీడీపీకి హ్యాట్రిక్ ఓటమి

image

చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఏడు చోట్ల హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. తిరుపతి లోక్‌సభ, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టులో వరుసగా టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. అక్కడ 2009లో కాంగ్రెస్ అభ్యర్థులు, 2014, 2019లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడు సార్లు గెలిచారు. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టారు.

News April 30, 2024

చిత్తూరు జిల్లాలో 16,43,593 మంది ఓటర్లు

image

చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 16,43,593 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ ఎస్. షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నగరి, జి.డి.నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం అసెంబ్లీలలో 8,06,070 మంది పురుషులు, 8,34,000 మంది స్త్రీలు మొత్తం 16,43,593 మంది ఓటర్లు ఉన్నారన్నారు.

News April 30, 2024

 రాజంపేట పార్లమెంటు బరిలో 18మంది అభ్యర్థులు

image

రాజంపేట పార్లమెంటు బరిలో MP అభ్యర్థులుగా 18మంది బరిలో ఉన్నారు. NDA కూటమి-నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, YCP-మిథున్ రెడ్డి, కాంగ్రెస్-S.భాషీద్, BSP-యుగేంద్ర, అన్న YSR-అక్బర్, M.బాషా, జై భారత్ పార్టీ-రమణయ్య, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ-సల్మాన్ ఖాన్, ఇండిపెండెంట్లు-వేంకటాద్రి, ఓబయ్యనాయుడు, నాగరాజు, నాగేశ్వర్ రాజు, శ్రీనివాసులు, రెడ్డిశేఖర్, ప్రదీప్, శ్రీనివాసులు, మాడా రాజ, సుబ్బనరసయ్య ఉన్నారు.

News April 30, 2024

చిత్తూరు: సమాచారం ఇవ్వండి.. వివరాలు గోప్యంగా ఉంచుతాం

image

చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం నిల్వలు, ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం వస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ మెంబర్లకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
కె.లక్ష్మీ ప్రసన్న, శిక్షణ, డిప్యూటీ కలెక్టర్ చిత్తూరు-ఫోన్ నెం :9603404789, శేషగిరి ఎస్సై-
9849962578, కృష్ణ కిషోర్ ఎస్సై-8019396602, విజయభాస్కర్-9491077011.

News April 30, 2024

ఏసీబీ వలలో కురబలకోట విద్యుత్ ఏఈ

image

కురబలకోట విద్యుత్ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కురబలకోట మండలంలో ట్రాన్స్ కో కార్యాలయం ఏఈగా వెంకటరత్నం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు కోసం ఓ రైతు వద్ద రూ.32 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.

News April 30, 2024

తిరుపతిలో 46 మంది పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జిల్లాలోనే అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానానికి 46 మంది పోటీ చేస్తున్నారని రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ప్రకటించారు. YCP నుంచి భూమన అభినయ్ రెడ్డి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు బరిలో ఉన్నారు. సీపీఐ నుంచి మురళి పోటీ చేస్తున్నారు. చంద్రగిరిలో 24 మంది, అత్యల్పంగా నగరిలో 7 మంది బరిలో ఉన్నారు.

News April 30, 2024

కుప్పంలోనూ గాజు గ్లాస్ గుర్తు

image

చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను కలవరపెడుతోంది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ గ్లాస్ గుర్తు ఈవీఎంలో ఉండనుంది. ఇక్కడ మొరసన్నపల్లి YCP సర్పంచ్ జగదీశ్ భార్య నీలమ్మ స్వతంత్ర అభ్యర్థిగా ఉండటంతో గ్లాస్ గుర్తు కేటాయించారు. చంద్రగిరి, మదనపల్లె, శ్రీకాళహస్తి, నగరిలోనూ ఇండిపెండెంట్లకు ఈ గుర్తు ఇచ్చారు. అక్కడ ఫలితాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి మరి.