Chittoor

News April 29, 2024

తిరుమలలో జరిగే ఉత్సవాలు ఇవే

image

తిరుమలలో శ్రీవారి గురువు జగద్గురు భగవద్ శ్రీరామానుజ ఉత్సవాలు మే 3న ప్రారంభం అవుతాయి. 4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయ తృతీయ నిర్వహిస్తారు. 12న జగద్గురు భగవద్ శ్రీ రామానుజ(శ్రీ భాష్యకారుల) శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరుపుతారు. 22న నృసింహ జ‌యంతి, నమ్మాల్వార్ వార్షిక శాత్తుమొర, 23న అన్నమాచార్య జయంతి జరుగుతుంది.

News April 29, 2024

21 నుంచి కళ్యాణ వేంకన్న బ్రహ్మోత్సవాలు

image

నారాయణవనం శ్రీపద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మే 21 నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. మే 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేసి మే 20న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో రోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

News April 28, 2024

ఎల్లుండి కలికిరికి జగన్ రాక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రచారానికి సీఎం జగన్ రానున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కలికిరికి చేరుకుంటారు. కలికిరి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ మేరకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 28, 2024

తిరుప‌తిలో ఫ్యాక్ష‌న్‌కు చోటు లేదు: ఆరణి

image

తిరుప‌తిలో క‌డ‌ప ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు చోటు లేద‌ని జ‌న‌సేన ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆర‌ణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి నగరంలోని 46, 48వ డివిజన్లలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ‌త 30 ఏళ్లుగా రాజారెడ్డి ద్వారా క‌డ‌ప సంస్కృతిని తిరుప‌తిలో అమ‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా భూమన క‌రుణాక‌ర్ రెడ్డి చేయిస్తున్న పనే కదా అని ఆరణి ప్ర‌శ్నించారు.

News April 28, 2024

తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు..!

image

CM జగన్ నిన్న మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో స్కిల్ హబ్, ప్రతి మండలంలో బాలికల జూనియర్ కాలేజీ నిర్మిస్తామని చెప్పారు. ఏదైనా ఆవాసంలో 50 శాతం దళితులు(కనీసం 500 మందిపైన) ఉంటే వాటిని పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఈప్రకారం కొన్ని వందల దళితవాడలు పంచాయతీలుగా మారే అవకాశం ఉంది.

News April 28, 2024

తిరుపతి: 22 నుంచి వసంతోత్సవాలు

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. మే 21వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వ‌హిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవాల్లో భాగంగా మే 23వ తేదీ ఉదయం 7.45 గంటలకు స్వర్ణ రథోత్సవం జరగనుంది.

News April 28, 2024

రేణిగుంట: ICIలో ప్రవేశాలు

image

రేణిగుంట మండలం కురుకాలువ వద్ద ఉన్న భారతీయ పాకశాస్త్ర సంస్థ (Indian Culinary Institute)లో 2024 -25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. BB.A/MBA(Culinary Arts) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు www.icitirupati.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 25.

News April 28, 2024

పలమనేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నం తన భార్యతో కలిసి పలమనేరు నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పలమనేరు వైపు వస్తున్న లగేజ్ ఆటో కంచిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీవరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

News April 28, 2024

చిత్తూరుకు రేపు నందమూరి బాలకృష్ణ రాక

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం చిత్తూరుకు రానున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా వస్తున్నట్లు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీ విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని పేర్కొన్నారు. అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

News April 28, 2024

ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.