Chittoor

News April 28, 2024

ALERT.. అగ్నిగుండంలా రాయలసీమ

image

భానుడి ప్రతాపానికి శనివారం రాయలసీమ ప్రజలు అల్లాడిపోయారు. అనంతపురం 43.7, కడప 43.4, తిరుపతి 42.9, నెల్లూరులో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.

News April 28, 2024

చౌడేపల్లి: బోయకొండలో ఉద్రిక్తత

image

టీడీపీ, వైసీపీ శ్రేణులు బోయకొండ క్రాస్ వద్ద శనివారం రాత్రి ఘర్షణ పడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం మేరకు.. టీడీపీకి చెందిన చిట్టిబాబు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో వివాదం మొదలైంది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. ఈ సంఘటనలో ఇరు పార్టీ నేతలకు గాయాలు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

నేడు బి కొత్తకోట రోడ్డు షోకు నందమూరి బాలకృష్ణ

image

బి.కొత్తకోటలో ఆదివారం ఉదయం జరిగే రోడ్డు షోలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తంబళ్లపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రా రెడ్డి పీఏ తెలిపారు. ఉదయం 6గంటలకు మొలకలచెరువుకు, 7.30 గంటలకు పిటిఎంకు, బి.కొత్తకోటకు 8.45కు చేరుకొని బి.కొత్తకోట పట్టణంలో జరిగే రోడ్ షోలో బాలకృష్ణ పాల్గొంటారు.

News April 27, 2024

TPT: ‘30లోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోండి’

image

అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నందు 2023-24 విద్యా సంవత్సరానికి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) పద్ధతిలో బి.ఎడ్ (B.Ed) ఆన్ లైన్ వెబ్ ఆప్షన్ల కోసం ఏప్రిల్ 30 తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రాంతీయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. బి.ఎడ్ (ODL) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడగలరు.

News April 27, 2024

పుంగనూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి

image

ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మృతి చెందిన సంఘటన పుంగనూరు మండలంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ప్రసన్నగారిపల్లె గ్రామానికి చెందిన నారాయణ కుమారుడు జగదీష్ (15) స్కూలుకు సెలవులు కావడంతో గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 27, 2024

చిత్తూరులో ఘనంగా నూతన కోర్ట్ భవనాల ప్రారంభోత్సవం

image

చిత్తూరులో శనివారం నూతన న్యాయస్థాన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బిజీగా ఉన్నప్పటికీ ప్రారంభోత్సవానికి రావడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో బార్ అసోసియేషన్ భాగస్వామ్యాన్ని అభినందించారు.

News April 27, 2024

చిత్తూరులో EVM స్ట్రాంగ్ రూములను తనిఖీ చేసిన ఎస్పీ

image

చిత్తూరు నగరం ఎస్వీ సెట్ కళాశాలలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ చందోలు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

News April 27, 2024

ద్రావిడ వర్సిటీలో యుజీ, పీజీ పరీక్షలు వాయిదా

image

ద్రావిడ వర్సిటీలో మే 1వ తేదీ నుండి జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఏకే వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. యూజీ, పీజీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు మే 1వ తేదీ నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందని.. అయితే కొన్ని పరిపాలన కారణాలవల్ల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు గమనించాలన్నారు.

News April 27, 2024

రేపు రేణిగుంటకు నందమూరి బాలకృష్ణ

image

ఆదివారం రేణిగుంట అంబేద్కర్ విగ్రహం వద్ద జరగబోవు కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ రానున్నారని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని కరకంబాడి పంచాయతీ బీసీ కాలనీలో టీడీపీ పార్టీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డితో కలిసి సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపలో హారతులతో ఆత్మీయ స్వాగతం లభించింది.

News April 27, 2024

పుంగనూరు: మోసగించిన యువకుడి అరెస్ట్

image

పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యంకు చెందిన ఎం.క్రిష్ణప్ప కుమారుడు మహేంద్ర (23) ఓ  బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవరెడ్డి పేర్కొన్నారు.