Chittoor

News April 27, 2024

పుంగనూరు: మోసగించిన యువకుడి అరెస్ట్

image

పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యంకు చెందిన ఎం.క్రిష్ణప్ప కుమారుడు మహేంద్ర (23) ఓ  బాలికను ప్రేమిస్తున్నట్లు నటించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. తర్వాత పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాఘవరెడ్డి పేర్కొన్నారు.

News April 27, 2024

చిత్తూరు: 27 నుంచి నామినేషన్ల విత్ డ్రా

image

ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. 27, 29 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో జరుగుతుందన్నారు. 28వ తేదీ ప్రభుత్వ సెలవు దినం కావున ఆ రోజు ఉపసంహరణ ప్రక్రియ ఉండదని పేర్కొన్నారు.

News April 27, 2024

చిత్తూరు: 213 మంది HMలకు షోకాజ్ నోటీసులు

image

యూడైస్ (విద్యార్థుల నమోదు) ప్రక్రియలో చోటు చేసుకున్న తప్పులను కారణాలుగా చూపుతూ 25 మండలాల్లోని 213మంది HMలకు, 26 మంది MEOలకు చిత్తూరు DEO దేవరాజు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శాఖాపరమైన లోపాలు సవరించకుండా సమాచారం రాలేదనే సాకుతో టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సరికాదనని ఉపాధ్యాయ సంఘం నేతలు అన్నారు. ఉపసంహరించుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.

News April 27, 2024

తిరుపతి: ఆమోదం 177.. తిరస్కారం 50

image

తిరుపతి జిల్లాలో ఒక MP, 7 శాసనసభ స్థానాలకు 227 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. తిరుపతి MP స్థానానికి 27 దాఖలవ్వగా మూడింటిని తిరస్కరించారు. జిల్లాలోని 7 శాసనసభ స్థానాలకు 200 దాఖలు చేయగా.. 47 తిరస్కరించారు. తిరుపతిలో 52కి 4, చంద్రగిరిలో 43కి 17, శ్రీకాళహస్తిలో 27కి 4, సత్యవేడులో 24కి 7, సూళ్లూరుపేటలో 16కి 2, గూడూరులో 21కి 6, వెంకటగిరిలో 17కి 7 తిరస్కరించారు.

News April 27, 2024

చిత్తూరులో ఆమోదించిన నామినేషన్ల వివరాలు

image

చిత్తూరు జిల్లాలో ఆమోదించిన నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. పుంగనూరులో 15 నామినేషన్లు దాఖలు కాగా 10 వాటిని ఆమోదించారు. నగరిలో 24 కు 7, జీడి నెల్లూరులో 21కి 12, చిత్తూరులో 21కి14, పూతలపట్టులో 19 కి 12, పలమనేరులో 19 కి 14, కుప్పంలో 18కి 15 నామినేషన్లు ఆమోదించినట్టు చెప్పారు. చిత్తూరు ఎంపీ స్థానానికి 35 నామినేషన్లు దాఖలు కాగా 21 వాటిని ఆమోదించామన్నారు.

News April 27, 2024

సత్యవేడు: మాజీ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ

image

సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత నామినేషన్ శుక్రవారం తిరస్కరణకు గురి అయింది. ఆమె టీడీపీ తరఫున ఒక సెట్టు నామినేషన్ వేశారు. పార్టీ బీఫామ్ సమర్పించకపోవడంతో ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.

News April 27, 2024

నేడు జిల్లాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రాక: కలెక్టర్ షణ్మోహన్

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నేడు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్, జస్టిస్ భట్టి చిత్తూరుకు రానున్నారని కలెక్టర్ ఎస్.షణ్మోహన్ శుక్రవారం తెలిపారు. జిల్లా నూతన ప్రధాన న్యాయస్థాన భవన సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

News April 26, 2024

TPT: ఐజర్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు

image

తిరుపతి IISERలో 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్-ఎంఎస్ (డ్యూయల్ డిగ్రీ), బీఎస్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధిత ఐజర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2024 ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఇతర వివరాలకు www.iiseradmissiఓn.in వెబ్‌సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మే 13.

News April 26, 2024

పీలేరులో 30న సీఎం జగన్ ప్రచార సభ

image

పీలేరులో 30న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తామని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన కోరారు. ప్రచార సభను విజయవంతం చేయాలన్నారు.

News April 26, 2024

రేణిగుంట: గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

image

జిల్లాలో ఒక్క రోజు పర్యటనను ముగించుకున్న ఏపీ గవర్నర్ ఎస్.నజీర్ శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.