Chittoor

News April 26, 2024

సోమల: ఈతకు వెళ్లి విద్యార్థి మృతి 

image

ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన సంఘటన సోమల మండలంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సదుం మండలం కారేవాండ్ల పల్లెకు చెందిన ముని-వెంకట సిద్ధుల కుమారుడు భవిత్ కుమార్(15) మండలంలోని నడింపల్లిలో సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో నేడు ఈత కోసం గుంజు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 26, 2024

40 మందిని చంపేశారు: పవన్ కళ్యాణ్

image

రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పెద్దిరెడ్డి ఫ్యామిలీ పాపాలు పెరిగిపోయాయి. ఎర్రచందనం డాన్ గంగిరెడ్డితో మిథున్ రెడ్డి తిరుగుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డు వస్తున్నారని 40 మందిని చంపేశారు. మరికొందరి కాళ్లు, చేతులు నరికేశారు. ఆస్పత్రుల్లో ఇంజెక్షన్లతో చంపేస్తున్నారు. యువత ఎదురు తిరిగితే జగన్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రోడ్ల మీదకు రాగలరా..?’ అని పవన్ ప్రశ్నించారు.

News April 26, 2024

తిరుపతి ఎంపీగా పోటీ చేసిన నేత మృతి

image

టీడీపీ నేత కారుమంచి జయరాం కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న చనిపోయారు. పోలీసు శాఖలో పని చేసిన ఆయన రిటైర్‌మెంట్ తీసుకుని పొత్తులో భాగంగా 2014లో BJP తిరుపతి MP అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో YCP అభ్యర్థి వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు TDPలో చేరారు. రేణిగుంట(M) అత్తూరులో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News April 26, 2024

CTR: టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ, టీడీపీలకు రెబల్ పోటు తప్పేలా లేదు. తాజాగా పలమనేరులో TDP రెబల్‌గా దామోదర్ నాయుడు (బుల్లెట్ నాయుడు) నామినేషన్ వేశారు. గత 30 ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్నా.. తనకు ఎవరూ గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. అందుకే టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికే సత్యవేడులో టీడీపీ రెబల్‌గా జేడీ రాజశేఖర్, కుప్పంలో వైసీపీ రెబల్‌గా ఓ మాజీ సర్పంచ్ నామినేషన్ వేశారు.

News April 26, 2024

CTR: 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో పాలిసెట్-2024 పరీక్ష ఈనెల 27న నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ డాక్టర్ జేమ్స్, ప్రిన్సిపల్ జగన్నాథరావు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరులో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కుప్పంలో 561 మంది, పలమనేరులో 1243 మంది విద్యార్థులు హాజరుకానుట్లు చెప్పారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు.

News April 25, 2024

చంద్రబాబుకు సాదర వీడ్కోలు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజంపేట, కోడూరు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి టీడీపీ, జనసేన నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. వాళ్లు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.

News April 25, 2024

CTR: రైలు ఢీకొని ముగ్గురి మృతి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో గురువారం సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. పోలీసుల వివరాల మేరకు… రామసముద్రం మండలం పట్రాజుపల్లికి చెందిన లోకేశ్, గంజిగానిపల్లికి చెందిన సుబ్బు, శశికుమార్ బెంగుళూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. పట్టాలు దాటే క్రమంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు చనిపోయారు.

News April 25, 2024

తిరుపతి: ఇలా ఫిర్యాదు చేయండి

image

తిరుపతి జిల్లా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, సి-విజిల్ కేంద్రాన్ని పోలీస్ అబ్జర్వర్ అరవింద్ సాల్వే గురువారం
పరిశీలించారు. అక్కడి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైనా ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు తన మొబైల్ నంబర్ 9154141876, policeobservertpt23@gmail.com ద్వారా సంప్రదించాలని సూచించారు.

News April 25, 2024

వైసీపీలో చేరిన అనీషా రెడ్డి దంపతులు

image

టీడీపీ పుంగనూరు మాజీ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి, అనీషా రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్‌ని వాళ్లు కలిశారు. అనీషా రెడ్డి దంపతులకు జగన్ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అనీషా రెడ్డి మంత్రి పెద్దిరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ పలమనేరు MLA అభ్యర్థి అమరనాథ రెడ్డికి శ్రీనాథ్ రెడ్డి సోదరుడు అవుతారు.

News April 25, 2024

తిరుపతి నగరంలో ఉద్రిక్తత

image

చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీ ర్యాలీగా వచ్చిన నాయకులు ఇద్దరు ఆర్వో కార్యాలయానికి వెళ్లే క్రమంలో కొందరు రాళ్లు విసిరారు. ఏమి జరిగిందో తెలుసుకునే లోపు నాయకులు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. పరిస్ధితి చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.