Chittoor

News April 25, 2024

బీఫామ్ అందుకున్న జయచంద్రా రెడ్డి

image

తంబళ్లపల్లె MLA సీటుపై సస్పెన్స్ వీడింది. టీడీపీ అభ్యర్థి జయచంద్రా రెడ్డికే బీపాం అందింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును ఆయన కలిసి బీఫామ్ అందుకున్నారు. మొదటి లిస్టులోనే జయచంద్రా రెడ్డిని TDP అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో తంబళ్లపల్లె, అనపర్తి టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సీటు బీజేపీకి ఇస్తారని, టీడీపీలోనే అభ్యర్థిని మార్చుతారని ఇన్ని రోజులు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

News April 25, 2024

తంబళ్లపల్లిలో ఉత్కంఠ…TDP అభ్యర్థిత్వంపై తేలని పంచాయితీ

image

తంబళ్లపల్లి TDPలో ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని సీట్లపై క్లారిటీ వచ్చినా తంబళ్లపల్లి విషయంలో ఇంకా పీటముడి వీడలేదు. తంబళ్లపల్లి సీటుకు తప్ప మిగిలిన అభ్యర్థులందరికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు బీఫామ్‌లను అందజేశారు. ఇక్కడ జయచంద్రారెడ్డిని మార్చి ఆ స్థానంలో కొండా నరేంద్ర లేదా శంకర్ యాదవ్‌లకు బీఫామ్ ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. నామినేషన్లకు ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

News April 25, 2024

చిత్తూరు: కర్ణాటక ఓటర్లకు సెలవు

image

చిత్తూరు జిల్లాలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల్లో పనిచేసే కర్ణాటకకు చెందిన ఓటర్లకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. కర్ణాటకలో ఈ నెల 26, మే 7వ తేదీన రెండు దశలుగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ పనిచేస్తున్నవారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు.

News April 25, 2024

మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి చిత్రాన్ని పచ్చబొట్టుగా వేసుకున్న అభిమాని

image

మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ భాష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి కోళ్ల బైలు పంచాయతీలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  ఓ అభిమాని షాజహాన్ భాష చిత్రాన్ని తన ఛాతిపై వేసుకొని అభిమానాన్ని చాటుకున్నాడు.

News April 25, 2024

చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చిత్తూరు పార్లమెంట్‌కు 4, శాసనసభకు 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గంగాధర్ నెల్లూరు నుంచి థామస్, నగరి నుంచి గాలి భానుప్రకాశ్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, కుప్పం నుంచి భరత్ నామినేషన్ వేశారు.

News April 25, 2024

చిత్తూరు: డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

image

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కేసులో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొంగారెడ్డి పల్లెలోని డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డికి చెందిన కారు షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఈ నెల 18న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎంసీసీ అధికారులు ప్రకటించారు.

News April 25, 2024

వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు: RRR

image

మంచి మనిషి, సేవాభావం కలిగిన పులివర్తి నాని భగవంతుని ఆశీస్సులతో విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు(RRR) అన్నారు. తనపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఎమ్యెల్యేగా నామినేషన్ వేశానని, ఆనవాయితీగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానని రఘురామ చెప్పారు. వైసీపీ డ్రామాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.

News April 25, 2024

పుంగనూరు: వికలాంగురాలిపై అత్యాచారం

image

పుంగనూరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చౌడేపల్లె మండలం అమినిగుంటలో సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో మానసిక, శారీరక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News April 24, 2024

CTR: సమోసాలు అమ్మే వ్యక్తి నామినేషన్

image

చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

News April 24, 2024

భరత్ ఆస్తి రూ.కోటి కన్నా తక్కువే..!

image

➤ కుప్పం అభ్యర్థి: KRJ భరత్ (YCP)
➤ చరాస్తి: రూ.98.47 లక్షలు
➤ స్థిరాస్తి: రూ.30 లక్షలు
➤ భార్య దుర్గ చరాస్తి: రూ.41.88 లక్షలు
➤ ఇద్దరు పిల్లల పేరిట ఆస్తి: రూ.32.78 లక్షలు
➤ అప్పులు: రూ.11.60 లక్షలు
➤ బంగారం: 950 గ్రాములు
➤ కేసులు: ఒకటి
➤ వాహనాలు: ఒకే కారు
NOTE: తనకు హైదరాబాద్‌కు సమీపంలో ఓ విల్లా తప్ప ఎలాంటి స్థలాలు, బిల్డింగ్‌లు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.