Chittoor

News March 20, 2024

మదనపల్లె: పెళ్లయిన ఆరు నెలలకే ఆత్మహత్యాయత్నం

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు ఇందిరా నగర్లో కాపురం ఉంటున్న వెంకటేశ్ స్థానికంగా ఉన్న శ్రీకళ(20)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను మదనపల్లికి తరలించారు.

News March 20, 2024

‘అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం’

image

తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. అలిపిరి మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచరిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే ట్రాప్ కెమెరాల ద్వారా ఎలుగుబంటి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. దీంతో భక్తులకు రక్షణ కల్పించేందుకు టీడీపీ తక్షణ చర్యలు చేపట్టింది. ఎలుగుబంటి సంచరిస్తున్న ప్రాంతంలో గస్తీని పెంచింది. ఒంటరిగా మెట్లదారిలో రావొద్దని, గ్రూపులుగా మాత్రమే రావాలని సూచించింది.

News March 20, 2024

చిత్తూరు: గెలిపిస్తారా.. షాక్ ఇస్తారా?

image

ప్రత్యర్థుల బలహీనతల కంటే సొంత పార్టీలోని అసమ్మతి నేతల తీరుపైనే విజయావకాశాలు ఉంటాయి. నగరిలో రోజాను YCP నేతలే వ్యతిరేకించినా ఆమెకే జగన్ టికెట్ ఇచ్చారు. తిరుపతిలో ఆరణి శ్రీనివాసులు వద్దని జనసేన, టీడీపీ నేతలు బాహటంగా చెబుతున్నారు. సత్యవేడులో ఆదిమూలాన్ని మార్చాలని, తంబళ్లపల్లెలో శంకర్‌కు టికెట్ ఇవ్వాలని నేతలు చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆయా చోట్ల ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.

News March 20, 2024

పొత్తులకు సహకారం లభించేనా?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించారు. తిరుపతిలో అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈక్రమంలో తమకు సీటు రాలేదంటూ కొందరు సహకరించడం లేదని తెలుస్తోంది. సీటు దక్కిన వారు సైతం ఇతర పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరడం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి విజయం సాధించాలంటే తప్పకుండా అన్ని పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.

News March 20, 2024

తిరుపతి: లక్షితను చంపిన చిరుత గుర్తింపు

image

గతేడాది ఆగస్టులో అలిపిరి మెట్ల మార్గంలో చిరుత దాడిలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే చిన్నారి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.

News March 20, 2024

చిత్తూరు జిల్లాకు చేరిన ఓటర్ ఎపిక్ కార్డులు

image

రాష్ట్ర ఎన్నికల సంఘం ముద్రించిన 1.11 లక్షల ఓటరు ఎపిక్ కార్డులు చిత్తూరు కలెక్టరేట్‌కు చేరాయి. ఈనెల 17న 81 వేలు, ఈనెల 18న 30 వేలు మొత్తం 1.11 లక్షల కార్డులు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. వీటిని స్కాన్ చేసి పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కు పంపారు. ఆ శాఖ నుంచి జిల్లాలోని సంబంధిత ఓటర్ల చిరునామాకు పోస్టు ద్వారా చేరవేయనున్నారు.

News March 20, 2024

చిత్తూరు: CR రాజన్‌‌కు అధ్యక్ష పదవి

image

TDP చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్‌ CR రాజన్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో వున్న పులివర్తి నాని TDP చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండటంతో ఆయన బాధ్యతలను రాజన్‌కు అప్పగిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు విడుదల చేశారు. ఆయన చిత్తూరు సీటు ఆశించగా గురజాల జగన్మోహన్‌కు దక్కింది.

News March 19, 2024

గుడిపల్లి: ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులపై వేటు

image

గుడిపల్లి మండలం చీకటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకట్, కుప్పం మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురుగేషన్ లను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కారణంగా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.

News March 19, 2024

చిత్తూరు: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ …. ఆ సేవలు బంద్

image

ఈసీ ఆదేశాల మేరకు గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాలలో వివిధ సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం ఫొటో లేని కొత్త స్టేషనరీ వచ్చేవరకు ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయొద్దని అధికారులు స్పష్టం చేశారు.

News March 19, 2024

బి.కొత్తకోట: ప్రియుడుతో కలిసి తండ్రిని హత్య చేయించిన కూతురు

image

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి కూతురే తండ్రిని హత్య చేయించిందని ములకలచెరువు ట్రైనీ DSP ప్రశాంత్ తెలిపారు. మండలంలోని మొరవపల్లి వద్ద కోళ్లఫారంలో వారం క్రితం టీడీపీ నేత రాజారెడ్డిని దారుణంగా హత్యగురైన విషయం తెలిసిందే. కాగా సోమవారం హత్యకేసులో నిందితులైన కూతురు బ్రాహ్మణి, ఆమె ప్రియుడు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు హత్యకేసు వివరాలు వెల్లడించారు.