Chittoor

News March 25, 2024

పలమనేరు: ఏడుగురు జూదరుల అరెస్ట్

image

పట్టణంలోని శ్రీనగరాకాలనీ సమీపంలో ఒక ప్రైవేటు ఐటిఐ సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఆకస్మికంగా దాడి చేసి అరెస్టు చేశారు. వారిలో పట్టణానికి చెందిన హోంగార్డు మహేష్ ఉన్నారు. అతనితో పాటు పట్టణానికి చెందిన చిన్న, మురుగ, చందు ప్రకాష్, మధుకర్, మారిముత్తు, సామిదొరై, అరెస్టు చేసి వారి నుంచి రూ.5000, 3 బైక్లు స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

చిత్తూరు: ఎన్నికల బరిలో మాజీ ముఖ్య మంత్రులు

image

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు పోటీలో ఉన్నారు. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ సీఎం చంద్రబాబు (TDP) పోటీ చేస్తుండగా, రాజంపేట పార్లమెంట్ స్థానానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ (BJP) బరిలో ఉన్నారు. చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్, ప్రస్తుత MP మిథున్ (YCP)తో పోటీ పడటానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు అనేది వేచి చూడాలి.

News March 25, 2024

పుత్తూరు: రైలు కింద పడి అర్చకుడు మృతి

image

ప్రమాదవశాత్తు రైలు కింద పడి పుత్తూరుకు చెందిన పురోహిత్ మూర్తి మృతి చెందిన ఘటన ఆదివారం చెన్నైలో జరిగింది. పుత్తూరులోని శ్రీకామాక్షీ సమేత శ్రీసదాశివేశ్వరాలయ ఆవరణలోని శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ అర్చకుడు మూర్తి(58) ఆదివారం ఓ పూజ నిమిత్తం సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లారు. చెన్నై పరిధిలోని ఆంబూరు రైల్వేస్టేషన్లో రైలు దిగి కదులుతున్న మరో రైలు ఎక్కేక్రమంలో అదే రైలు కిందపడి మృతి చెందాడు.

News March 25, 2024

చిత్తూరు: అన్న ఎంపీగా.. తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అన్నదమ్ములైన కిరణ్, కిషోర్ లు తక్కువకాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. AP అసెంబ్లీ స్పీకర్, CMగా కిరణ్ బాధ్యతలు నిర్వర్తించారు. TDP జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషోర్ కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల బరిలో పీలేరు అసెంబ్లీ స్థానానికి కిషోర్, రాజంపేట MP స్థానానికి కిరణ్ పోటీ పడుతున్నారు.

News March 25, 2024

చిత్తూరు: విద్యుత్తు బిల్లులు రూ.3 కోట్లు వసూలు

image

విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ పరిధిలో ఆదివారం ఒకరోజే రూ. 3 కోట్లు బిల్లులు వసూలయ్యాయని ఎస్ఈ కృష్ణారెడ్డి తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం సెలవురోజు బిల్లుల వసూలు కేంద్రాలు యధావిధిగా పనిచేశాయన్నారు. సోమవారం కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయని, వినియోగదారులు ఉపయోగించు కోవాలని చెప్పారు. వంద శాతం బిల్లుల వసూళ్లకు ఇంజినీర్లు, అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.

News March 25, 2024

వరదయ్యపాళెం: అక్క మరణాన్ని తట్టుకోలేక దివ్యాంగుడి ఆత్మహత్య

image

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 24, 2024

తిరుపతి ఎంపీ అభ్యర్ధిగా MLA.. రాజంపేటకు మాజీ CM

image

బీజేపీ అధిష్ఠానం ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గూడూరు MLA వర ప్రసాద్‌కి.. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ CM నల్లరి కిరణ్‌కుమార్ రెడ్డికి సీటు కేటాయించింది. తిరుపతి YCP అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, రాజంపేట అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలో ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా అరణి శ్రీనివాసులుకి సీటు కేటాయించారు.

News March 24, 2024

రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అలీ

image

పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన షేక్ మహమ్మద్ ఆలీని రాష్ట్ర వైసీపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి మహమ్మద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

News March 24, 2024

తిరుమల: రేపే రూ.300 టికెట్ల విడుదల

image

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి జూన్ నెల రూ.300 ప్రత్యేక దర్శన కోటా టికెట్లను సోమవారం విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటాను విడుదల చేస్తారు.

News March 24, 2024

తిరుపతి ఎంపీగా గూడూరు MLA..?

image

గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు బీజేపీలో చేరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో గూడూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వచ్చే ఎన్నికలకు వైసీపీ ఆయనకు సీటు నిరాకరించింది. బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు రేసులో ఉన్నారు.