India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లాలో 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యంతో బాధపడే కార్డుదారులు 46,919 మంది ఉన్నారు. వీరందరికీ గురువారం నుంచే చౌక దుకాణాల డీలర్లు వారి ఇళ్ల వద్దే రేషన్ సరకులు పంపిణీ ప్రారంభించినట్లు డీఎస్వో శంకరన్ తెలి పారు. మార్చి ఒకటి నుంచి సాధారణ కార్డుదారులకు చౌకదుకాణాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సరకుల పంపిణీ ఉంటుందన్నారు.

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పణకు మిగిలిందిక 2 రోజులే. ఈనెల 28 చివరి రోజు కావడంతో ఆన్లైన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్‌లో లైవ్ సర్టిఫికెట్ నమోదు చేయవచ్చు. చిత్తూరు జిల్లాలో పెన్షన్‌దారులు 12,500 ఉండగా గురువారం వరకు 11780 మంది లైవ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. మరో 720 మంది సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంది.

ప్రశాంత వాతవరణంలో పది పరీక్షలు నిర్వహణకు సిద్ధం కావాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

సంజీవని ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో పలమనేరు నియోజకవర్గానికి చెందిన డాక్టర్లతో సంజీవిని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. సంజీవిని సెంటర్ ద్వారా ఓపీ సేవలు, ఇంటి వద్ద నుంచే నియామక సేవలు అలాగే రిఫరల్ సేవలు అందించబడతాయని పేర్కొన్నారు. ఈ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు.

త్వరలో చిత్తూరులో ప్రారంభం కానున్న కేంద్రీయ విద్యాలయం పనులను కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల భవన నిర్మాణ పనులు, తరగతి గదుల సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు

పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-5 నుంచి గ్రేడ్-4కు ప్రమోషన్ ఇచ్చారు. చిత్తూరు DPO సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లాలో 23 మందికి ప్రమోషన్ రాగా.. అన్నమయ్య జిల్లాలో పదోన్నతి పొంది అదనంగా ఉన్న 14 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నారు. తిరుపతి జిల్లాలో 10 మందికి ప్రమోషన్ ఇచ్చారు. పలు గ్రేడ్లలో ఉన్న 10 మందిని చిత్తూరు జిల్లాకు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కుప్పం RDO శ్రీనివాసరాజును బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది రెవిన్యూ డివిజన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందులో భాగంగా కుప్పం RDO శ్రీనివాసరాజు, నగరి RDO భవాని శంకర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసింది. ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వద్ద రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్‌గా వెంకటేశ్ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.