Chittoor

News July 23, 2024

Miss Universe Andhra గా చిత్తూరు జిల్లా యువతి

image

మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ, AP, కర్ణాటక స్టేట్‌ 1వ ఆడిషన్‌ ఫినాలే పోటీలు హైదరాబాదులోని శ్రీనగర్‌కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఇందులో శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్‌ మిస్‌ యూనివర్స్‌ ఏపీగా ఎంపికయ్యారు. శాంతిపురం(మం) ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన హైదరాబాద్‌లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేశారు. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News July 23, 2024

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై కొనసాగుతున్న విచారణ

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణకు మరికొందరు అధికారులు వెళ్లనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాను వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.

News July 23, 2024

నేటి నుంచి ఈఏపీసెట్ రెండోవిడత కౌన్సెలింగ్

image

ఇంజినీరింగ్ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ రెండోవిడత ఆన్లైన్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కేటీరోడ్డులోని ఎస్వీప్రభుత్వ పాలి టెక్నిక్ హెల్ప్ లైన్ కేంద్రంలో ఈనెల 23 నుంచి 25వరకు మూడురోజులపాటు ఈ కౌన్సెలింగ్ జరగనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు.

News July 23, 2024

TTDలో ఉద్యోగాలు.. అది ఫేక్ నోటిఫికేషన్

image

లడ్డూ కౌంటర్, టీటీడీ రూములు కేటాయించే ఉద్యోగాలంటూ శ్రీలక్ష్మీశ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ పేరిట ఓ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. దీనిపై TTD స్పందించింది. ‘ఓ ఫేక్ నోటిఫికేషన్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అది ఫేక్ నోటిఫికేషన్. దానిని ఎవరూ నమ్మకండి’ అని TTD ట్వీట్ చేసింది.

News July 22, 2024

మిథున్ రెడ్డి ఆరోపణలకు పోలీసుల వివరణ

image

కొత్త ప్రభుత్వ వచ్చాక 31 మందిని హత్యచేశారని ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసులు స్పందించారు. ‘జూన్ 4 నుంచి జులై 22 వరకు రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయి. అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీకి చెందినవారు. పాత కక్షలతో పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2హత్యలు జరిగాయి. మృతులు ఇద్దరూ YCPకి చెందిన వారు’ అని ఏపీ పోలీసులు ట్వీట్ చేశారు.

News July 22, 2024

ప్రమాదం కాదని భావిస్తున్నాం: DGP

image

మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగింది ప్రమాదం కాదని భావిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో వీఆర్ఏ ఒక్కరే ఉన్నారని.. ఆయనే ఆర్డీవోకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎక్కువ అవకతవకలకు అవకాశం ఉన్న సెక్షన్‌లోనే మంటలు చెలరేగడం అనుమానాలకు తావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని.. షార్ట్ సర్క్యూట్‌కు తక్కువ అవకాశం ఉందన్నారు.

News July 22, 2024

ద్రావిడ వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కుప్పం సమీపంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నాయని ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య వి.కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News July 22, 2024

PHOTO: అసెంబ్లీ బయట నల్లకండువాతో పెద్దిరెడ్డి

image

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు,MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్‌తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.

News July 22, 2024

చిత్తూరు : జాతీయ మామిడి దినోత్సవం (ప్రత్యేకం)

image

మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెర ఇండికా. మామిడి భారతదేశ జాతీయ పండు. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పండ్లలో రాజుగా మామిడిని పిలుస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు మామిడి సాగుకు ఎంతగానో అనుకూలం. జిల్లాలో మామిడి ఉత్పత్తులకు మంచి వ్యాపారం, మార్కెటింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. మీకు నచ్చిన మామిడి రకం కామెంట్ చేయండి.

News July 22, 2024

కుప్పం పోలీసుల అదుపులో నాగార్జున యాదవ్

image

సీఎం చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌పై టీడీపీ నేతలు ఫిర్యాదుతో కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ హోటల్ వద్ద రాత్రి నాగార్జున యాదవును కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌ను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.