India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కుప్పం నుంచి చేపట్టిన తన యువగళం యాత్ర బంగారుపాళ్యం నుంచి దండయాత్రగా మారిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘యువగళాన్ని అడ్డుకునేందుకు ఆనాటి ప్రభుత్వం జీవో తెచ్చి అడ్డంకులు సృష్టించింది. అయినా భయపడలేదు. నాపై 23 కేసులు నమోదు చేశారు. పాదయాత్రలో నా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు సూపర్-6 పథకాలు ఉపయోగపడతాయి. సీఎం చంద్రబాబుతో చర్చించి వాటిని అమలు చేస్తా’ అని లోకేశ్ చెప్పారు.
బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్‌లో మరో ప్రమాదం జరిగింది. ఇటీవల ఇక్కడ ఘోర ప్రమాదం జరగడంతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. వీటిపై అవగాహన లేని ఓ టెంపో ట్రావెలర్ వేగంగా వచ్చి ఇక్కడ అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు జిల్లాలో బైక్‌లు వాడే అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా హెల్మెట్లను వినియోగించడం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.
తిరుపతి జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లను ఎస్పీ సుబ్బారాయుడు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారి చేశారు. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లనో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి స్థాన చలనం కల్పించారు. బదిలీ అయిన వారు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లి మినహా మిగతా సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్
ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్ చేయడానికి ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కడప జోన్-4 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెంగల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీజిల్ మెకానిక్ 97, మోటార్ మెకానిక్ 6, ఎలక్ట్రిషియన్ 25, వెల్డర్ 4, పెయింటర్ 2, ఫిట్టర్ 9, డ్రాఫ్ట్ మెన్ సివిల్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వరద బాధితుల సహాయార్థం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారి ముఖ్యమంత్రి సహాయ నిధికి రెండు కోట్లు ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థిక సహాయ చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబీకులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 66 మంది డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. హెడ్ క్వార్టర్స్ లో పనిచేస్తున్న 25 మంది డీటీలు, రీసర్వే డీటీలు 26 మంది, ఎన్నికల డీటీలు నలుగురు, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న డీటీలు ఐదుగురు, డీఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న ఆరుగుర్ని బదిలీచేశారు. అలాగే 17 మంది వీఆర్వోలు బదిలీ అయ్యారు.
తన కన్న కూతురితో తన భర్త అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ భార్య పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. తన కుమార్తె హాస్టల్లో చదువుకుంటుందని తెలిపారు. ఇటీవల ఇంటికి వచ్చిందని, ఎవరూ లేని సమయంలో తండ్రి వేధించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీఐ మద్దయ్యచారి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటనలో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వేంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో ఎస్పీ సుబ్బారాయుడుతో కలసి అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. తిరుమల, శ్రీకాళహస్తిలో దర్శనాలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతుంటారని, ఆ మేరకు ఏర్పాట్లు లోపాలు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.