Chittoor

News July 18, 2024

చిత్తూరు: ప్రేమపేరుతో మోసం.. యువతి సూసైడ్

image

ఐరాల మండలం చిగరపల్లికి చెందిన విద్య(20)ను ప్రేమ పేరుతో ఓ యువకుడు మోసం చేయడంతో ఉరివేసుకొని మృతి చెందింది. కాణిపాకం ఎస్ఐ రామ్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిగరపల్లి వద్ద యువతి మృతదేహంతో గ్రామస్థులు ధర్నాకు దిగారు. ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

News July 18, 2024

SV యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా అప్పారావు

image

SV యూనివర్సిటీకి ఇన్‌ఛార్జ్ VCగా అప్పారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పారావు SVUలో బయోకెమిస్ట్రీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా పద్మావతి యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వి.ఉమను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈమె సోషియాలజీ ఫ్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలకు ఇన్‌ఛార్జులుగా నియమిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

రామసముద్రం: చేతికి అందే ఎత్తులో విద్యుత్ వైర్లు

image

రామసముద్రం మండలం మినికి సమీపంలోని పొలంలో 11కేవీ విద్యుత్ లైన్ చేతికి అందే ఎత్తులో ఉంది. పొలంలో రైతులు వ్యవసాయ పనులు చేసేందుకు కూడా భయపడుతున్నారు. పొలం దుక్కి చేయాలంటే ట్రాక్టర్ గాని లారీలు గాని నడపలేని పరిస్థితి నెలకొంది. వైర్లు అంత కిందకు వేలాడుతుండటంతో ఎప్పుడు ఏమి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News July 18, 2024

చిత్తూరు: విద్యుత్ పోల్స్ మార్చండి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తక్షణమే మార్పు చేయాలని ఎస్ఈ సురేంద్రనాయుడు ఇంజినీర్లను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాల కురుస్తున్నాయని.. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వినియోగదారులు సైతం ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News July 18, 2024

తిరుపతి: PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 20.

News July 18, 2024

అమిత్‌షా ఆదేశాలు.. పుంగనూరులో విచారణ

image

తనకు స్కాలర్‌షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్‌షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News July 18, 2024

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి హత్య

image

మదనపల్లె పట్టణం వీవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లి రాముల గుడి వీధిలో ఉంటున్న నీరుగట్టి చెన్నారెడ్డి(65)ని వీవర్స్ కాలనీలోకి తీసుకెళ్లారు. అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్య బుధవారం సాయంత్రం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

News July 18, 2024

మనసు చలించేలా రోడ్ల పై యాచిస్తూ వృద్ధురాలు

image

ఒకప్పుడు వృద్ధ మహిళ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి పిల్లలను పోషించి ఉంటుంది. ఇప్పుడు సొంత పిల్లలకే ఆమె భారంగా మారి వీధిపాలయింది. మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డులో కనుచూపు లేక, బక్క చిక్కిన శరీరంతో కడుపుకు పట్టేడు మెతుకుల కోసం ఎదురుపడే వారందరినీ యాచిస్తూ కనబడటం చలించివేస్తుంది. అనాధ ఆశ్రమాలైన ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకోవాలని పలువురు కోరుతున్నారు.

News July 17, 2024

తిరుపతి: ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం

image

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను మీడియా ప్రతినిధులు బుధవారం తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద దగ్ధం చేశారు. మీడియా ప్రతినిధులను దూషించడం దారుణమని వారు చెప్పారు. మీడియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధి ఇలా దిగజారి మాట్లాడటం తగదని తెలిపారు. గిరిబాబు, భాస్కర్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, హరిబాబు, ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News July 17, 2024

తిరుమల లడ్డూ తయారిపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టీటీడీ

image

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వివరించింది.