Chittoor

News January 16, 2026

CTR: మామిడి రైతులకు బకాయిలు అందేనా.?

image

మామిడి రైతులకు పల్ప్ ఫ్యాక్టరీలు అందించాల్సిన బకాయిలు ఇంతవరకు అందకపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో సీజన్ ప్రారంభానికి సిద్ధమైనా ఇంతవరకు ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడం లేదు. రూ.50 కోట్ల వరకు బకాయిలు రైతులకు ఫ్యాక్టరీలు అందించాల్సి ఉంది. గత సీజన్లో ప్రభుత్వం కిలో తోతాపూరికి రూ.4 రాయితీ చెల్లించగా.. ఫ్యాక్టరీలు రూ.8 చెల్లించాలని ఆదేశించింది.

News January 16, 2026

చిత్తూరులో జనాభా లెక్కలు ఎప్పటి నుంచో తెలుసా?

image

చిత్తూరు జిల్లాలో జన గణననకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి తాను ముఖ్య జన గణన అధికారిగా ఉంటానని వెల్లడించారు. ఇతర శాఖ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో సుమారు ఆరు లక్షల గృహాలు ఉండగా.. 2011 లెక్కల ప్రకారం18 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి జన గణన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

News January 16, 2026

చిత్తూరు: అసభ్యకర పోస్టులపై విచారణ

image

సమాచార శాఖ.కుప్పం అధికారిక వాట్సాప్ గ్రూపులో <<18869391>>అసభ్యకర వీడియోలు <<>>కలకలం రేపాయి. ఇదే అంశంపై Way2Newsలో ప్రచురితమైన వార్తకు పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ &ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం RDO, I&PR అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు.

News January 15, 2026

రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

image

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News January 15, 2026

చిత్తూరు ఎస్పీకి నోటీసులు

image

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.

News January 15, 2026

చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

image

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.

News January 15, 2026

చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News January 14, 2026

టీచర్లకు చిత్తూరు DEO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈనెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. 189 మంది మాత్రమే నమోదు చేశారని.. మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు.

News January 14, 2026

CTR: భారీగా పడిపోయిన టమాటా ధరలు

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు క్రమంగా పడిపోతున్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ బుధవారం గరిష్ఠంగా రూ.194, కనిష్ఠంగా రూ.140 పలికింది. పలమనేరులో గరిష్ఠ ధర రూ.220, కనిష్ఠ ధర రూ.170, వి.కోటలో గరిష్ఠ ధర రూ.200, కనిష్ఠ ధర రూ.140, ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.230, కనిష్ఠ ధర రూ.120గా నమోదైంది.

News January 14, 2026

చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

image

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.