Chittoor

News June 22, 2024

సీఎం కుప్పం పర్యటనను విజయవంతం చెయ్యండి

image

ఈనెల 25, 26వ తేదీలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, డిఆర్ఓ బి.పుల్లయ్య, డ్వామా పీడీ ఎన్.రాజశేఖర్ సంబంధింత అధికారులు పాల్గొన్నారు.

News June 22, 2024

కుప్పం : విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు

image

అదుపుతప్పి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటన కుప్పంలో చోటుచేసుకుంది. కుప్పం – క్రిష్ణగిరి జాతీయ రహదారిలోని తంబిగానిపల్లి వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభం ముక్కలు కాగా.. అదృష్టవశాత్తు విద్యుత్ వైర్లు తెగిపడలేదు. కాగా ప్రమాదంలో కారులో ఉన్నవారు స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది.

News June 22, 2024

కుప్పంలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇలా..!

image

ఈనెల 25న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12:30 గంటలకు పీఈఎస్ మెడికల్ కళాశాలకు చేరుకుంటారు. పట్టణంలో ఒంటిగంటకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సమావేశంలో మాట్లాడుతారు. 3:30 కి పీఈఎస్ ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.

News June 22, 2024

రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాసులు ఇద్దరు మృతి

image

తిరువన్నామలై దర్శనం కోసం వెళ్తున్న తిరుపతిలోని సుబ్బారెడ్డి నగర్, రెడ్డిగుంటకు చెందిన భక్తుల బృందానికి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరో ఎనిమిది మంది గాయాలయి తిరువన్నామలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రాథమిక సమాచారం. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

కురబలకోటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన దారుణ ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని లక్కసముద్రం గ్రామం, మేకలవారిపల్లెకు చెందిన లక్ష్మిరెడ్డి రాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆగ్రహించిన భర్త భార్యను కొడవలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. విషయం తెలుసుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 22, 2024

తిరుపతి : దరఖాస్తులకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి శాస్త్రి, ఆచార్య, డిప్లొమా, సర్టిఫికెట్ మొదలైన 21 విభాగాల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ రాఘవేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు svvedicuniversity.ac.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30.

News June 22, 2024

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షన్మోహన్ పరిశీలించారు. సీఎం పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసీ శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.

News June 22, 2024

వైఎస్ షర్మిలతో కలిసి నిరసనలో పాల్గొన్న సోమశేఖర్ రెడ్డి

image

నీట్ పరీక్ష ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల విజయవాడ లెనిన్ సెంటర్‌లో శుక్రవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పీలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి నల్ల దుస్తులు ధరించి పాల్గొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో పేపర్‌ లీక్‌ అయిందన్నారు. ప్రశ్నపత్రం లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు.

News June 21, 2024

తిరుపతి: ఎంపికైన వారి జాబితా విడుదల

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో ప్రాక్ శాస్త్రి (Praak Shastri) కోర్సులో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ కోర్సుకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసినట్లు అకడమిక్ డీన్ ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://nsktu.ac.in/ వెబ్ సైట్ ద్వారా సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను తెలుసుకోవచ్చని సూచించారు.

News June 21, 2024

ఉచిత నైపుణ్య శిక్షణ

image

చిత్తూరు: ఇరువరంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) నందు APSSDC, PMKV సంయుక్త ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, అసిస్టెంట్ ప్లంబర్ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నట్లు సెంటర్ ఏడీ సతీశ్ చంద్ర పేర్కొన్నారు. పదో తరగతి పాసై, 15-45 సంవత్సరంలోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు PH కాలనీ వద్ద గల NAC కార్యాలయంలో సంప్రదించగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.