Chittoor

News January 9, 2026

క్రీడాకారుడిగా రాణించి.. హత్య కేసులో చిక్కుకుని.!

image

ముద్దాయి గణేశ్ నేషనల్ లెవెల్ క్రికెటర్. 2021లో దివ్యాంగుల ఐపీఎల్ రాజస్థాన్ రాజ్ వార్స్ టీంకు ఆడాడు. ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీలలో పాల్గొంటున్నాడు. 2023 సంవత్సరంలో ఇండియన్ ఇంటర్నేషనల్ వికలాంగుల క్రికెట్ జట్టుకు ఎంపికయ్యి ఇండియా- నేపాల్ మ్యాచ్లోనూ ఆడాడు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

News January 9, 2026

కుప్పం: పగటిపూటే వ్యవసాయ కరెంట్.!

image

కుప్పం డివిజన్‌లోని 26 సబ్‌స్టేషన్ల పరిధిలో 141 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. ఇందు కోసం 570 ఎకరాలకుగాను 542.16 ఎకరాల భూ సేకరణ పూర్తైంది. వీటి ద్వారా 130 ఫీడర్లకు అనుసంధానమైన 32,106 వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందనుంది.

News January 9, 2026

చిత్తూరులో గణతంత్ర వేడుకలపై సమీక్ష

image

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్ఓ కార్యాలయంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం 7 గం.లకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇన్‌ఛార్జ్‌గా చిత్తూరు ఆర్డీవో ఉంటారన్నారు.

News January 9, 2026

చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.

News January 8, 2026

చిత్తూరు కోర్టులో పేలుడు పదార్థాలు లేవు: పోలీసులు

image

చిత్తూరు కోర్టులో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. జడ్జికి బాంబు బెదిరింపులపై మెయిల్ రావడంతో అడిషనల్ ఎస్పీ దేవదాస్ ఆధ్వర్యంలో సిబ్బంది నాలుగు బృందాలు కోర్టులో తనిఖీలు చేపట్టాయి. కోర్టులోని వారిని సురక్షితంగా బయటకు పంపి అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐదు గంటలపాటు సాగిన తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని పోలీసులు తేల్చారు.

News January 8, 2026

చిత్తూరు: ఈ నెల 10న స్కూళ్లకు హాలిడే.!

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 10న రెండో శనివారం సెలవుగా ప్రకటించినట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలో ఆ రోజును ప్రత్యామ్నాయ పాఠశాల దినంగా గుర్తించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం 10న సంక్రాంతి సెలవు మంజూరు చేయడంతో పాఠశాలలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ రోజుకు ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సిన తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.

News January 8, 2026

చిత్తూరు: హంతకుడు నేషనల్ క్రికెటర్ గణేశేనా.?

image

ఆయన వికలాంగుడు.. <<17815171>>దేశానికి<<>> ఆడుతుంటే అందరూ శభాష్ అన్నారు. విజయం ఇచ్చిన <<18790831>>గర్వమో<<>>, మానవత్వం మరిచాడో ప్రేయసిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. SRపురానికి చెందిన క్రికెటర్ గణేశ్ కవితను చంపి నీవా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కూడా వికలాంగురాలు. వీరి మధ్య ఇది వరకే పెళ్లి ప్రస్తావనపై గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

News January 8, 2026

పుంగనూరు: 2042 వరకు అనుమతులు ఉన్నా.?

image

సదుంలో క్వారీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐతేశ్వర్ణ్‌కు 2022 OCT 21న క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి. సర్వే నంబర్‌ 270/2లోని సుమారు 4 హెక్టార్ల విస్తీర్ణంలో రంగు గ్రానైట్‌ రాళ్ల తవ్వకాలను ప్రారంభించారు. ఈ క్వారీకి 2042 OCT 20 వరకు అనుమతులు ఉన్నాయి. గ్రామస్థులు, క్వారీ యజమానులు మధ్య పంచాయితీ PS వరకు వెళ్లింది. గ్రామస్థులు కావాలనే అడ్డుకుంటున్నారనే వివాదం నడుస్తోంది.

News January 8, 2026

చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

image

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.

News January 7, 2026

క్రీడా పరికరాలు అందించిన చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు వికలాంగుల క్రీడా సంఘం సభ్యులు రాష్ట్రస్థాయి పోటీలలో పథకాలు సాధించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్‌ను బుధవారం కలిశారు. మరిన్ని విజయాలు సాధించేందుకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు. వారి వినతి మేరకు.. షటిల్ బ్యాట్స్ 6, షూస్ 10 జతలు, జావెలిన్ 2, షాట్ పుట్ 2, షటిల్ కాక్ బాక్సులు రెండు వారికి కలెక్టర్ అందించారు. వారిని అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.