Chittoor

News January 3, 2026

చిత్తూరు: KGBVల్లో 25 పోస్టులకు దరఖాస్తులు.!

image

చిత్తూరు జిల్లాలోని KGBVల్లో 25 ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్-4, ANM-6, హెడ్ కుక్-1, ASST కుక్-4 ఖాళీలు ఉండగా టైప్-4లో వార్డెన్-2, పార్ట్ టైమ్ టీచర్-3, చౌకిదార్-2, హెడ్ కుక్-1 ASST కుక్-2 ఉన్నాయి. మహిళలకు మాత్రమే అవకాశం. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.

News January 3, 2026

తిరుపతిలో రేపు చిరంజీవి మూవీ ట్రైలర్ లాంచ్

image

హీరో చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఆదివారం తిరుపతిలోని SV సినీప్లెక్స్‌లో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం ఉండనుంది. ఈ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గరికిపాటి, సుస్మిత కొణిదెల, హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర చిత్ర బృంద సభ్యులు పాల్గొననున్నారు.

News January 3, 2026

పాసు పుస్తకాల్లో తప్పులుంటే అర్జీలు ఇవ్వాలి: కలెక్టర్

image

నూతనంగా పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు ఉంటే అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. పాసు బుక్కుల్లో తప్పులు గుర్తించిన రైతులు తహశీల్దార్ లేక వీఆర్వోలకు అర్జీలు ఇస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేశారు. కాగా నూతనంగా పంపిణీ చేస్తున్న పాసు పుస్తకాల్లోనూ పలు తప్పిదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

News January 3, 2026

చిత్తూరు: రేషన్ సరకుల కోసం ఆందోళన.!

image

బియ్యం అందరికీ ఇచ్చేవరకు రేషన్ షాప్ తెరవొద్దని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పాలసముద్రం మండలం మణిపురం చౌకదుకాణం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ గుర్రప్ప నిరసనకారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

News January 2, 2026

చిత్తూరు: 59 వేల పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ

image

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో 59,701 పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని 298 గ్రామాల పరిధిలోని అర్హులకు అందజేయనున్నట్టు ఆయన వెల్లడించారు. రీ సర్వే ప్రక్రియలో ఆధునిక సాంకేతికను ఉపయోగించి కచ్చితంగా భూ హద్దులను నిర్ణయిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను అధికారులు.. ప్రజాప్రతినిధులతో కలిసి అందజేస్తారని చెప్పారు.

News January 2, 2026

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

image

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 2, 2026

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

image

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News January 2, 2026

చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

image

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి

News January 2, 2026

చిత్తూరు: తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

జనవరి 1న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోయాయి. చిత్తూరు అర్బన్‌లో ఒక రిజిస్ట్రేషన్ కూడా జరగకపోగా, చిత్తూరు రూరల్ పరిధిలో 4 మాత్రమే అయ్యాయి. సాధారణ రోజుల్లో రెండు కార్యాలయాల్లో కలిపి 30-50 మధ్య రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. పండగ నెల కావడంతో క్రయ, విక్రయదారులు లేకపోవడంతో కార్యాలయాలు బోసిపోయాయి. జనవరి 1న సెలవుగా భావించి పలువురు రాలేదని అధికారులు చెప్పారు.

News January 2, 2026

చిత్తూరు MPకి 94 శాతం హాజరు

image

2025 సంవత్సరంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు పార్లమెంటుకు 94 శాతం హాజరయ్యారు. మొత్తం 122 ప్రశ్నలను పార్లమెంటులో అడిగారు. ఏడు అంశాలకు సంబంధించిన డిబేట్స్‌లో ఆయన పాల్గొన్నారు.