India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కురబలకోట(మం), కంటేవారిపల్లె వద్ద కారు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు ముదివేడు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. తంబళ్లపల్లె మండలం, కోటాలకు చెందిన నాని నాయక్(20), రఘు నాయక్ (21) బైకులో కంటేవారిపల్లెకు వినాయకుని విగ్రహాలు చూడడానికి వచ్చారు. విగ్రహాలు చూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా కారుఢీకొని నాని మృతి చెందాడు. రఘునాయక్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలో పీఎం ఆవాస్ యోజన లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గృహ నిర్మాణాలపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. 22,125 గృహాల నిర్మాణాల పూర్తికి లబ్ధిదారులతో చర్చించి.. నిర్మాణాలను పూర్తిచేసేలా చూడాలన్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను ప్రతి లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. డీఆర్‌డీఎ ద్వారా మహిళా సంఘ సభ్యులకు రుణాలు అందించేలా చూడాలన్నారు.
ఒంటరి జీవితంపై విరక్తితో డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ముదివేడు మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలం, తెట్టుకు చెందిన లేట్ మహేశ్వర్ కొడుకు జయకృష్ణ (21) మదనపల్లెలోని ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోవడం, దానికితోడు ఒంటరిజీవితం గడపడం జీర్ణించుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.
కుప్పం డిపోకు చెందిన బస్సు వీకోట మండలం ముదురం దొడ్డి వద్ద వెళ్తుండగా బస్సు వెనకాల చక్రం రన్నింగ్‌లో ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా బస్సును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో బస్ సర్వీసులను పెంచిన ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. 22 మంది ప్రయాణికుల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు.
తిరుపతి SV యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 9వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. డిక్సన్, మారుతి సుజుకి కంపెనీ ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. మొత్తం 365 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వివరాలకు https://forms.gle/aPNi5UoTf8ARRnT6 గూగుల్ పామ్ చూడాలి.
భారత ప్రభుత్వం 2015 నుంచి ఏటా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 20 వేల కుటుంబాలు పైగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె, వరదయ్యపాలెం, నారాయణవనం, పాలమంగళం, పులిచెర్ల ప్రాంతాల్లో సిల్క్, కంచి పట్టుచీరలు నేస్తుంటారు. 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం చేనేత కార్మికులను ప్రోత్సహించింది.
తిరుమలలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి కొండకు వస్తున్న బైకును.. అదే మార్గంలో తిరుమలకు వస్తున్న ఎలక్ట్రికల్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. మృతదేహాలు బస్సు కిందే ఇరుక్కుపోయాయి. మృతులు ఎవరనేది తెలియాల్సి ఉంది.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పుంగనూరు ప్రాజెక్టుల నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ నిర్మాణంలో రైతులు నష్టపోకుండా తమ సొంత నిధులు రూ.1.49 కోట్లను నష్టపరిహారంగా చెల్లించామని గుర్తించారు. టీడీపీ కుట్రలతో ప్రాజెక్టులను అడ్డుకుందన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రైవేటు డీఎల్ఈడీ కాలేజీల్లో 2018-20 రెగ్యులర్, స్పాట్ అడ్మిషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, ఆ కళాశాల మూతపడినట్లయితే కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలను సంప్రదించాలని ప్రిన్సిపల్ శేఖర్ సూచించారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో సంప్రదించి పరీక్ష ఫీజు కట్టి రాయవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్వేటినగరం డైట్ కాలేజీని సంప్రదించాలని సూచించారు.
తనపై <<13792038>>అవినీతి <<>>ఆరోపణలు నిరూపిస్తే పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమని పీలేరు సర్పంచ్ జీనత్ షఫీ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ‘నేను పదవిలోకి వచ్చినప్పటి నుంచే పంచాయతీ అప్పుల్లో ఉంది. అయినా పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నా. పార్టీలకు అతీతంగా బాధ్యతతో పాలన చేశా’ అని చెప్పారు. పీలేరు రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిన్న ఎంపీడీవో ప్రకటించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.