Chittoor

News August 7, 2024

తిరుపతి జిల్లాలో చిరుత సంచారం?

image

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరమాలలో అడవి జంతువు సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేషమ్మ సోమవారం రాత్రి తన పశువులను పొలాల సమీపంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం పాలు పితికేందుకు వెళ్లగా తాడుకు కట్టేసిన దూడను చంపి తినడం గుర్తించారు. అటవీ బీట్ అధికారి కిషోర్ కుమార్ జంతువు పాద ముద్రలు సేకరించారు. దాడికి పాల్పడింది చిరుతా? లేదా రేసుకుక్కలా? అని తేలాల్సి ఉంది.

News August 7, 2024

తిరుపతి: 20వ తేదీ నుంచి పీజీ పరీక్షలు

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 20వ తేదీ నుంచి పీజీ M.A/M.Sc/M.Com ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం అవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు. వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News August 6, 2024

మధ్యవర్తులను సంప్రదించవద్దు: టీటీడీ

image

ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్యవర్తులను సంప్రదించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇటీవల వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి టికెట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించినట్లు పేర్కొంది. అటువంటి వాటినీ బ్లాక్ చేశామని.. ఇకపై ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది.

News August 6, 2024

TTDలో సెల్ ఫోన్లు, వాచీల టెండర్ కం వేలం

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన సెల్ ఫోన్లు, వాచీలు ఆగస్టు 12, 13వ తేదీల్లో టెండర్ కం వేలం(ఆఫ్‌లైన్) నిర్వహించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఇతర వివరాలకు www.tirumala.orgను చూడాలని సూచించింది.

News August 6, 2024

మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయండి

image

మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో నిందితులను అరెస్టు చేయాలని మదనపల్లె కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రెడ్డి సాహెబ్ డిమాండ్ చేశారు. సబ్ కలెక్టరేట్లో నిరసన తెలిపారు. గత నెల 21న గుర్తుతెలియని వ్యక్తులు రెవెన్యూ రికార్థులు దగ్ధం చేసిన విషయం తెలిసిందే. ఫైళ్ల దగ్ధం జరిగి 15 రోజులు గడుస్తున్న నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడంగానిచేయలేదని అన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్ర ఇచ్చారు.

News August 6, 2024

చిత్తూరు: అగస్తీశ్వరాలయంలో విచారణ

image

చిత్తూరు నగరంలోని అగస్తీశ్వర ఆలయంలో గత నెల 20 వ తేదీ పూజా సామాగ్రి దొంగతనంపై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసన్నలక్ష్మి విచారణ నిర్వహించారు. దొంగతనం ఘటనపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు గ్రీవెన్స్ లో జేసీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుమనప్రియ, VHP సభ్యులు రామ్ భద్ర, చిట్టిబాబు, రామ్మూర్తి, తోటపాళ్యం వెంకటేష్ , సిద్దు తదితరులు పాల్గొన్నారు.

News August 6, 2024

ప్రైవేటీకరణ జాబితాలో తిరుపతి విమానాశ్రయం

image

కేంద్రం రూపొందించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌లో దేశవ్యాప్తంగా చేర్చిన 25 విమానాశ్రయాల్లో తిరుపతి ఉన్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్‌ మొహోల్‌ తెలిపారు. అత్యుత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకోవడానికే లీజుకు ఇస్తున్నామన్నారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని AAI దేశంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు.

News August 6, 2024

తిరుపతి: బాలుడి మిస్సింగ్.. సేఫ్

image

హైదరాబాద్ మీర్‌పేట‌లో తప్పిపోయిన బాలుడు మహీధర్ రెడ్డి(13) ఆచూకీ లభ్యమైంది. బాలుడు తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లిన అతడు ఎంతకీ తిరిగి రాలేదు. పేరెంట్స్ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ పరిశీలించారు. మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో దొరికిన ఫుటేజ్ ద్వారా బాలుడి ఆచూకీ కనుగొన్నారు.

News August 6, 2024

పుంగనూరు: డెంగ్యూతో విద్యార్థిని మృతి

image

డెంగ్యూతో ఏడో తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పుంగనూరులో సోమవారం చోటుచేసుకుంది. సోమల మండలం నంజంపేట పంచాయతీ ఇర్లపేటకు చెందిన వెంకటరమణ, ఈశ్వరమ్మ దంపతుల కుమార్తె పూర్ణిమ (11) పట్టణ పరిధిలోని మేలుపట్ల గిరిజన వసతిగృహంలో ఏడో తరగతి చదువుతోంది. తీవ్ర జ్వరం రావడంతో జులై 27న ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చికిత్స చేయించినా తగ్గకపోవడంతో తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది.

News August 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోండి

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో దేవరాజు తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోగా ఉండాలన్నారు. పరీక్ష డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు చెప్పారు.