Chittoor

News June 14, 2024

తిరుపతి: ఆస్తి తగాదాలు.. కత్తితో తాడి

image

తొట్టంబేడు మండలంలోని పూడి గ్రామంలో ఆస్తి విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హరిని ఆయన అన్నతో పాటు వారి కుటుంబీకులు కత్తులు, కర్రలతో దాడులు చేశారు. హరికి తలపై బలమైన గాయమైంది. దీంతో చికిత్స నిమిత్తం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై తొట్టంబేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

News June 13, 2024

చిత్తూరు జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులో..?

image

గతంలో జగన్ DSC ద్వారా దాదాపు 6 వేల పోస్టులు ప్రకటించగా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 337 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. తాజాగా మెగా DSC పేరిట CM చంద్రబాబు దాదాపు 16 వేలకు పైగా ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు. గత నోటిఫికేషన్‌తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెండింతలకు పైగానే పెరిగింది. మరి తాజా నోటిఫికేషన్‌లో జిల్లాకు వెయ్యి పోస్టుల వరకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

News June 13, 2024

చిత్తూరు MLAల ఆశలన్నీ వాటిపైనే..!

image

మంత్రివర్గంలో 25 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతానికి 24 మంది ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్ పదవులకూ కేబినెట్ హోదా వర్తిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు. ఈనేపథ్యంలో ఖాళీగా ఉన్న ఓ బెర్త్‌తో పాటు, దానికి సమానంగా భావించే కేబినెట్ హోదా పదవులపై జిల్లా ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి ఏ పదవి వస్తుందో వేచి చూడాలి మరి.

News June 13, 2024

ముగిసిన చంద్రబాబు తిరుమల పర్యటన

image

ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన తిరుచానూరుకు వచ్చారు. అక్కడ అమ్మవారి దర్శనం అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు వీడ్కోలు పలకగా.. ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరుగు ప్రయాణమయ్యారు.

News June 13, 2024

రేణిగుంట: ముఖ్యమంత్రికి ఘనంగా వీడ్కోలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు లభించింది. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరుగు ప్రయాణమయ్యారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.

News June 13, 2024

పుంగనూరులో పొట్టేళ్లకు భలే గిరాకీ

image

పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో గురువారం పొట్టేళ్ల సంత జరిగింది. బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేళ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో జత పొట్టేళ్లు ధర రూ. 40 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేల నుంచి రూ.60 వేల వరకు పలికింది. పొట్టేళ్ల సంతకు కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు తరలివచ్చారు. దీంతో సంతలో సందడి నెలకొంది.

News June 13, 2024

తిరుపతి: బీటెక్ ఫలితాలు విడుదల

image

శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం (SPMVV)లో ఈ ఏడాది మే నెలలో బీటెక్ (B.Tech) నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారిని పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News June 13, 2024

చిత్తూరు: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

image

జిల్లాలో పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2900 యాజమాన్య పాఠశాలల్లో 2,39,629 మంది చదువుతున్నారు. 2483 ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1,67,941 మంది విద్యార్థులు ఉండగా, 417 ప్రైవేటు యాజమాన్య పాఠశాలలు 71,688 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా, పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

News June 13, 2024

చిత్తూరు: ముగిసిన గంగమ్మ జాతర

image

చిత్తూరు స్థానిక సంతపేట సమీపంలోని తిమ్మసముద్రంలో గంగమ్మ జాతర వైభవంగా ముగిసింది. ప్రజలు ఊరేగింపుగా వచ్చి గంగమ్మకు సారెను సమర్పించారు. అనంతరం మేళతాళాలు, వాయిద్యాల నడుమ నిమజ్జన వేడుకలు ఘనంగా పూర్తిచేశారు. పాలసముద్రం మండలంలోని శ్రీకావేరిరాజుపురం, బలిజకండ్రిగ గ్రామాల్లో రెండ్రోజులుగా గంగమ్మ జాతర భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంగారుపాళ్యం మండలంలోని తగ్గువారిపల్లెలో గంగ జాతర వైభవంగా జరిగింది.

News June 13, 2024

మదనపల్లెలో ప్రభుత్వ టీచర్ దారుణ హత్య

image

ప్రభుత్వ స్కూల్ టీచర్ దొరస్వామి దారుణ హత్యకు గురైన ఘటన మదనపల్లెలో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికంకాలనీ, ఆంజనేయస్వామి గుడి వద్ద కాపురం ఉంటున్న టీచర్ దొరస్వామి(62)ను ఎవరో తన ఇంటిలోనే పథకం ప్రకారం మరణాయుధాలతో దారుణంగా హత్యచేసి పరారయ్యారు. మృతదేహాన్ని 1టౌన్, తాలూకా సిఐలు వల్లి భాష, శేఖర్ లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.