Chittoor

News June 13, 2024

తిరుపతి: ఇంటర్న్‌షిప్ అవకాశాలు

image

APSSDC ఆధ్వర్యంలో పైతాన్, డేటా బేస్, డేటా అనలిటిక్స్ స్కిల్స్‌పై 8 వారాల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశం కల్పిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. బీటెక్ 3, 4 సంవత్సరాల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు https://swiy.co/360interns2024 వెబ్‌సైట్లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. చివరి తేదీ జూన్ 27.

News June 13, 2024

14న తిరుపతిలో ఉద్యోగ మేళా

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో 14వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. అపోలో ఫార్మసీ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డీఫార్మసీ, బీఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులన్నారు. 50 ఖాళీలు ఉన్నట్లు చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News June 12, 2024

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచెరువు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అతని తలపై రాయితో కొట్టి చంపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతదేహాన్ని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పాకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 12, 2024

మరికాసేపట్లో చంద్రబాబు రాక.. భారీ భద్రత

image

సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి చంద్రబాబు తిరుపతి, తిరుమల పర్యటన చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఆయన తిరుమలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా డీఐజీ షిముషి బాజ్ పాయ్ అధ్వర్యంలో ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. సీఎం పర్యటన కోసం 1550 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు. కొండపై క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

News June 12, 2024

తిరుమలకు బయలుదేరిన సీఎం

image

CM చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 9 గం.కు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు. తిరుమలలోని శ్రీగాయత్రి నిలయం గెస్ట్‌హౌస్‌లో బసచేసి రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. CM తిరుపతి పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు.

News June 12, 2024

మూకుమ్మడిగా ముక్కంటి మండలి రాజీనామా

image

శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు వారి వారి పదవులకు రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మండల సభ్యులు కొంతమంది మరుసటి రోజు రాజీనామా చేశారు. అయితే మరి కొంతమంది సభ్యులు, అధ్యక్షులు రాజీనామా చేయకపోవడంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు ఆలయ ధర్మకర్తల మండలి మూకుమ్మడిగా రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఆలయ ఈఓకి అందజేశారు.

News June 12, 2024

చిత్తూరు జిల్లా నుంచి ఈసారి చంద్రబాబు ఒక్కరే!

image

TDP అధినేత చంద్రబాబు 24మందితో కూడిన తన మంత్రి వర్గాన్ని ప్రకటించారు. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు మినహా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలకు 11 టీడీపీ, ఒకటి జనసేన, రెండు వైసీపీ గెలిచింది. కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కాగా గత ప్రభుత్వంలో జిల్లా నుంచి పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి మంత్రులుగా చేయడం తెలిసిందే.

News June 12, 2024

SPMVV: PGలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV) పీజీ (PG) M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. GAT-B 2024 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 15.

News June 12, 2024

తిరుపతి: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారిలోని పాకాల మండలం నేండ్రగుంట సమీపంలోని రాడార్ కేంద్రం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ, మరో వ్యక్తి మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తున్న కుటుంబంగా భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News June 12, 2024

నేడు తిరుమలకు చంద్రబాబు

image

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిరుమలకు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం చంద్రబాబు రానున్నారు. బుధవారం రాత్రి తిరుమలకు చేరుకొని గాయత్రి నిలయం అతిథి భవనంలో బసచేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకొనున్నారు. 9 గంటలకు తిరుమలలో నుంచి అమరావతికి తిరిగి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.