India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని కుప్పం DSP పార్థసారథి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని, పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు వంటివి నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.

గురువుల సమాజ నిర్దేశకులని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి మరువలేనిదని కొనియాడారు. గురువులకు ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తెలియజేశారు.

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధుడి ఆలయాన్ని ఈనెల 7వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు. గ్రహణం విడిచిన తర్వాత 8వ తేదీ ఉదయం 4 గంటలకు ఆలయం శుద్ధి చేస్తామన్నారు. స్వామికి అభిషేకం చేసి ఉదయం 6గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలను సైతం క్లోజ్ చేస్తారు.

చిత్తూరు జిల్లాలో ఉచిత పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. ఇంటర్‌లో 40శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న ఈనెల 8వ తేదీలోపు అఫ్లికేషన్ ఫిల్ చేసి చిత్తూరులోని DMHO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు www.appmb.co.in వెబ్‌సైట్ చూడాలన్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం- తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.

హంద్రీనీవా కాలువలో నీళ్లు రావడం లేదని ప్రచారాలు చేసిన వారిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు X వేదికగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించినట్లు కుప్పం అర్బన్ సీఐ శంకరయ్య వెల్లడించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని తప్పుడు కథనాలు, పోస్టులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

చిత్తూరు జిల్లా గ్రామీణ నీటి సరఫరా(RWS) శాఖ ఎస్ఈగా ప్రసన్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఈఈగా పనిచేస్తున్న ఆయనకు ఎస్ఈగా ప్రమోషన్ వచ్చింది. బదిలీపై చిత్తూరుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి చేస్తానన్నారు. అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆయన కలిశారు.

చిత్తూరు జిల్లాలో 697 పంచాయతీలకు గాను 667కు నిధులు వచ్చాయి. 16వ ఆర్థిక సంఘం కింద కేంద్రం రూ.29.78 కోట్లు రిలీజ్ చేసింది. రికార్డులు పూర్తి చేయకపోవడంతో 17 పంచాయతీలు, ఎన్నికలు జరగకపోవడంతో మరో 13 పంచాయతీలకు నిధులు రాలేదు. టైడ్ నిధులను పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. అన్‌లైడ్ నిధులను వీధి లైట్లు, శ్మశానాల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేస్తారు.

చిత్తూరు జిల్లా విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని DEO వరలక్ష్మి కోరారు. దరఖాస్తుకు సర్టిఫికెట్లు అవసరం లేదని, పరీక్ష రాసే సమయానికి అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ పిల్లలు రూ.50 పరీక్ష ఫీజు ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో ఇచ్చే ఎస్బీఐ కలెక్ట్ లింక్‌లోనే చెల్లించాలన్నారు.
Sorry, no posts matched your criteria.