Chittoor

News June 10, 2024

చిత్తూరు: శునకానికి పదవీ విరమణ

image

డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్‌కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి.ఎస్.పి మహబూబ్ బాషా, ఆర్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

News June 10, 2024

చిత్తూరు: ప్రేమజంట సూసైడ్.. పీటీఎంలో కేసు నమోదు

image

బత్తలపల్లె అడవిలో ఆత్మహత్యకు యత్నించి మృతిచెందిన ప్రేమజంట ఘటనపై పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు కేసు నమోదు చేశారు. ములకలచెరువు మండలం, దేవలచెరువు నరేంద్ర(25), రాణి(17) ప్రేమించుకున్నారు. బత్తలాపురం అడవికి వెళ్లి పురుగు తాగిన విషయం తెలిసిందే. ములకళచెరువు ఎస్‌ఐ వారిని మదనపల్లెకు తరలించగా ఇద్దరూ ఆదివారం మృతి చెందారు. పీటీఎం పరిధిలోకి వస్తుందని ఎస్ఐ కేసు నమోదు చేశారు.

News June 10, 2024

తిరుపతి: నేటి నుండి తరగతుల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) విద్యార్థులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. గత నెల 11 నుంచి వేసవి సెలవులు ప్రకటించగా నేటి నుంచి తరగతులు సందడిగా మారనున్నాయి. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట ఎస్వీయూ ఉపకులపతి శ్రీకాంత్ రెడ్డి రాజీనామా చేయాలంటూ నిరసన చేసిన విషయం తెలిసిందే.

News June 10, 2024

చిత్తూరు: 78 మంది స్వతంత్ర అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు

image

చిత్తూరు జిల్లాలో తాజా ఎన్నికల్లో వైసీపీ, కూటమి అభ్యర్థుల దెబ్బకు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. చిత్తూరు లోక్ సభ స్థానానికి మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. వారిలో 17 మంది డిపాజిట్లు కోల్పోయారు. మరోవైపు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో 78 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రతి చోటా వైసీపీ, కూటమి నేతలు మినహా మిగిలినవారు డిపాజిట్లు కోల్పోయారు.

News June 9, 2024

నగరి : మోడీకి శుభాకాంక్షలు తెలియజేసిన రోజా

image

నగరి: భారతదేశ ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా శుభాకాంక్షలు తెలియజేశారు. తన సోషల్ మీడియా వేదికగా వరుసగా మూడోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు అన్నారు.

News June 9, 2024

పాకాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి స్పాట్ డెడ్

image

పాకాల మండల పరిధిలోని పెరుమాలగుడిపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని సుమో ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చౌడేపల్లికి చెందిన బన్నీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 9, 2024

రేపే కల్కి 2898 AD ట్రైలర్..చిత్తూరులోని ఈ థియేటర్లో స్క్రీనింగ్!

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న కల్కి 2898 AD ట్రైలర్‌ రేపు విడుదలకానుంది. చిత్తూరు జిల్లా అభిమానుల కోసం జిల్లాలోని పలు థియేటర్లలో‌ రేపు 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు.చిత్తూరు- MSR
తిరుపతి- సంధ్య, పీలేరు- అజంతా, పుంగనూరు- బాలాజీ, నగరి- శ్రీనివాసక్యూబ్, శ్రీకాళహస్తి- RR, మదనపల్లె- రవి,
పలమనేరు- రంగ మహాల్ థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్క్రీనింగ్ చేస్తారు.
SHARE IT

News June 9, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

image

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచియున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 79,398 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,557 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీకి శనివారం రూ.2.90 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఆదివారం వెల్లడించింది

News June 9, 2024

తిరుపతి: PG కోర్సుల్లో దరఖాస్తులకు రేపు చివరి తేదీ

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ (PG) ఆచార్య, ఎంఏ శబ్ద బోధ, ఎంఏ హిందీ, ఎమ్మెస్సీ యోగ థెరపి, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. CUET ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://nsktu.ac.in వెబ్ సైట్ చూడగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 10.

News June 9, 2024

పెద్దిరెడ్డి విదేశాలకు పారిపోకుండా చూడాలి: MLA

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సత్యవేడు నియోజకవర్గంలో ఖనిజ సంపదను పెద్దిరెడ్డి దోచేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా పాస్ పోర్టు రద్దు చేయాలి. ఆయన అవినీతిపైన ప్రశ్నించినందుకే నాకు సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. చంద్రబాబు నన్ను అక్కున చేర్చుకుని టికెట్ ఇవ్వడంతో గెలిచాను’ అని ఆదిమూలం అన్నారు.