India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఆగస్టు 8న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ వెంకట రమణారెడ్డి తెలిపారు. 8వ తేదీ ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు.
డీఎల్ఎడ్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజు ఈనెల 11వ తేదీలోగా చెల్లించాలని డీఈవో దేవరాజు సూచించారు. 2023-25, 2021-23, 2022-24 బ్యాచ్ ఒన్స్ ఫెయిల్డ్ విద్యార్థులకు సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 19 వరకు గడువు ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు, నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులు తప్పినవారు రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140 అని చెప్పారు.
అర్థం కాని పాఠాలు, చదువుల ఒత్తిడి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయి. కురబలకోట యవకుడు నవీన్ కుమార్ <<13746460>>ఆత్మహత్య <<>>ఘటనే ఇందుకు నిదర్శనం. ‘అమ్మా.. నాన్న.. తరగతిలో చెప్పే విషయాలు నాకు అర్థం కావడం లేదు. అందుకే నేను చచ్చిపోతున్నా’ తిరుపతిలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదివే నవీన్ చివరి మాటలు ఇవి. జీవితంలో పైకి రావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. బలవన్మరణాలకు పాల్పడి తల్లిదండ్రులను బాధపెట్టడం సరికాదు.
మదనపల్లెలో రికార్డుల దగ్ధంపై CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. భూ బాధితులందరికీ న్యాయం జరగాలంటే ఈ కేసును CIDకి అప్పగించాల్సిందేనని చెప్పారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో బాధితులు ఉంటారనేది తాను అసలు ఊహించలేదని మదనపల్లెలో అర్జీలు స్వీకరించిన సిసోడియా సీఎంకు చెప్పారు. సీఐడీ విచారణపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.
కుప్పం పట్టణంలోని పాత వైసీపీ కార్యాలయం హోటల్‌గా మారనుంది. ఎన్నికల్లో ఓటమి అనంతరం పలువురు వైసీపీ నాయకులు స్థానికంగా అందుబాటులో ఉండటం లేదని సమాచారం. పార్టీ కార్యకలాపాలు పెద్దగా నిర్వహించడం లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్ తన క్యాంపు కార్యాలయంలోనే పార్టీ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పాత ఆఫీసు భవనాన్ని ఖాళీ చేశారు. సదరు యజమాని అందులో హోటల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ఎస్పీ మణికంఠ సూచించారు. పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం ఎస్పీ నిర్వహించారు. కొత్త చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని ఆయన సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలన్నారు. పెండింగ్ కేసులపై శ్రద్ధ వహించి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల అఫిడవిట్‌లో స్థిరాస్తుల వివరాలను పేర్కొనలేదని పిటిషనర్ తెలపడంతో పెద్దిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులనూ ప్రతివాదులుగా చేర్చాలంది. తదిపరి విచారణ ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
అవును ఇది అక్షరసత్యం. గడిచిన ఐదేళ్లలో తిరుపతి జిల్లాలో 3746 మంది మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఇందులో బాలికలు 1389 మంది, 2357 మంది యువతులు, మహిళలు ఉన్నారు. అలాగే గడిచిన ఐదేళ్లలో 3848 మంది ఆచూకీ గుర్తించారు. ఇందులో 1420 మంది బాలికలు, 2418 మంది యువతులు ఉన్నారు. 2019 ముందు కేసులను కలపడంతోనే ఐదేళ్లలో ఆచూకీ దొరికన వారి సంఖ్య పెరిగింది.
తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్ నెలలో ఎం ఫార్మసీ (M.Pharmacy) 2వ సెమిస్టర్, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో MBA (CBCS) 1వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
టైర్ల కంపెనిలో పని చేయడానికి వచ్చిన కార్మికుడిని కత్తితో పొడిచి హత్యచేసి, మరొక వ్యక్తిపై దాడిచేసిన కేసులో నిందితునికి మదనపల్లె 2వ అదనపు జిల్లాజడ్జి బందెల అబ్రహాం జీవితఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పుచెప్పారు. ఏపీపీ, టూ టౌన్ సీఐ యువరాజ్, ఎస్ఐ వెంకటసుబ్బయ్య తెలిపిన వివరాలు.. మదనపల్లి భాగ్యలక్ష్మి రైస్ మిల్లులో టైర్ల తయారీకి వచ్చిన కేరళ మణికంఠన్‌ను 2016లో సుబ్రహ్మణ్యం హత్యచేయడంతో శిక్ష పడింది.
Sorry, no posts matched your criteria.