India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం ఘటనపై ఇద్దరు RDOలు, సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. అగ్ని ప్రమాదం ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను వారిపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే CI, మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
మద్యం మత్తులో కుమార్తెను కన్న తండ్రి చంపిన సంఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. నడింపల్లికు చెందిన గౌతమి స్థానిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. గౌతమి సక్రమంగా పనులు చేయడం లేదని తండ్రి మందలించగా.. ఎదురు మాట్లాడిందని మద్యం మత్తులో కుమార్తెను సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైర్‌తో గొంతు నులిమి చంపేశాడు. రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ట్వీట్‌కు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వైదీప్తి కౌంటర్ ఇచ్చారు. ‘మూడేళ్ల క్రితం నా వయస్సు 23. నేను USలో చదువుతున్నా. అప్పుడు మీ పార్టీ ప్రతీకార రాజకీయాలతో మా నాన్నను అన్యాయంగా అరెస్టు చేశారు. ఆ సమయంలో మేము అనుభవించిన బాధ ఏంటో ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు.
అంతరాయం లేని విద్యుత్తు, నాణ్యమైన సరఫరానే లక్ష్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఈ సురేంద్ర నాయుడు వెల్లడించారు. వీటి నిర్మాణానికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రమాదాల నివారణలో భాగంగా విద్యుత్తు లైన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రమాదకర లైన్లు, స్తంభాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నామని వివరించారు.
మదనపల్లెలో రికార్డుల దగ్ధం తర్వాత భూకబ్జా బాధితుల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. ఈక్రమంలో పెద్దిరెడ్డి, మాధవరెడ్డి, వైసీపీ నేతలు, తదితరులపై మొత్తం 229 ఫిర్యాదులు అందాయి. ఎవరిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..
➤ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: 20
➤ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి: 8
➤ వి.మాధవ రెడ్డి: 9
➤ వైసీపీ నేతలు: 27
➤ పేర్లు ప్రస్తావించనవి: 69
➤ ఇతరుల పేర్లుతో: 96
మదనపల్లెలో ఫైళ్ల దగ్ధంపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. తట్టివారిపల్లెలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి కీలక దస్ర్తాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచరుడైన బాబ్‌జాన్ ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు. విచారణకు తాము ఎప్పుడు పిలిచినా రావాలంటూ బాబ్‌జాన్‌కు నోటీసులు ఇచ్చారు.
సోమల మండలం ఆవులపల్లె దగ్గర 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి PA శశిధర్ బలవంతంగా కాజేశారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ కోసం హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి అధికారులు వెళ్లారు. అరెస్ట్ భయంతో శనివారమే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారిక PAగా పని చేసిన తుకారం విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులు సీజ్ చేశారు.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న ఏస్ఎస్డీ క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1,2లోని కంపార్ట్‌మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.
‘అరకాసుపల్లి కోటకు ఆరుగురు రెడ్లు, ఒక్కో రెడ్డికి ఆరుగురు భోగంసానులు’ అని కథలుగా చెప్పుకొన్న ఆ కోట నేడు కనుమరుగైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం(M) ఎలవానెల్లూరు పంచాయతీలో ఉన్న ఈ కోటపై పలువురి కన్నుపడింది. కోనేరు, నగారా రాయి, ధ్వజస్తంభం గుప్తనిధుల అన్వేషకులు నాశనం చేశారు. కోటను కొందరు ఆక్రమించి చదును చేసి తమ పొలంలో కలిపేసుకున్నారు.
9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ. 10న కల్కి జయంతి. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి. 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. 15న స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి. 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. 16న వరలక్ష్మీ వ్రతం. 19న శ్రావణ పౌర్ణమి. గరుడ సేవ. 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
Sorry, no posts matched your criteria.