India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 16-18 గంటల సమయం పడుతుందని సమాచారం. కంపార్ట్‌మెంట్లన్నీ నిండి టీబీసీ సర్కిల్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 61,698 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,082 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం ఒక్కరోజే శ్రీవారి హుండీకి రూ.3.55 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు శుక్రవారం తెలిపారు.
గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇందులో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబుపై 17 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా సీఐడీ నమోదు చేసినవే కావడం గమనార్హం. వీటిలో అంగళ్లు అల్లర్లపై రెండు హత్యాయత్నం కేసులు కట్టారు. ఇవి అన్నీ కూడా అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గంలోని స్టేషన్లలో నమోదయ్యాయన్నారు.
గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో పుంగనూరులోని భీమగానిపల్లిలో పోలీసులకు-టీడీపీ శ్రేణులకు మధ్య జరిగిన ఘర్షణలపై ప్రస్తావించారు. దీనిపై గత వైసీపీ ప్రభుత్వంలో ఒకే రోజు పుంగనూరు TDP ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని A1గా చేర్చి,7 హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. మొత్తంగా 499 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఉన్న రాస్ భవనంలో కృత్రిమ కాలు ఇవ్వడానికి ఈనెల 27వ తేదీన క్యాంపు నిర్వహించనున్నారు. తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాస్ ప్రతినిధులు కోరారు. అర్హులైన దివ్యాంగులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వైద్య సర్టిఫికెట్, వికలత్వం కనిపించేలా రెండు ఫొటోలు తీసుకొని రావాలని సూచించారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చిలో PG M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
పీలేరు మండలం, కావలిపల్లె పంచాయతీ, ఒంటిల్లులో టీడీపీ నేత గిరి నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంపై డీఎస్పీ రామచంద్ర రావు విచారణ చేపట్టారు. హత్యాయత్నం ఘటన జరిగిన ఇంటిని డీఎస్పీ, పీలేరు సీఐ మోహన్ రెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్కులు, గ్లౌజులు తొడిగి ఉన్నట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. నిందితులతో తాను ప్రతిఘటించానని, వారు తమ ద్విచక్ర వాహనాల్లో పరారీ అయ్యారన్నారు.
తిరుపతి పద్మావతి నగర్‌కు చెందిన టీపీ దాస్, మోహన్(35) అన్నాదమ్ముళ్లు. మోహన్ ఇటీవల రెండో పెళ్లి చేసుకోగా.. ఆమె వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయాడు. నిన్న సాయంత్రం అన్నతో కలిసి మద్యం తాగాడు. తరువాత దాసు బయటకు వెళ్లాడు. అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిన అన్న భార్య సునీత(40), కూతుళ్లు దేవశ్రీ(13), నీరజ(10)లను మోహన్ కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో 10 రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. తిరుపతి, రేణిగుంట, పాకాల, చిత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం గూడూరు, సూళ్లూరుపేట స్టేషన్లు ఇందులో ఉన్నాయి. వీటిని ఆధునికరించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తి వివరాలను దాచిపెట్టి ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బీసీవై అధినేత రామచంద్రయాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా బుధవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఇరువర్గాల న్యాయవాదులతో పాటు పుంగనూరు రిటర్నింగ్ అధికారి హైకోర్టుకు హాజరయ్యారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.
తిరుపతి పద్మావతి వర్సిటీ సమీపంలోని మునిరెడ్డి నగర్లో బుధవారం రాత్రి జరిగిన హత్యల ఘటనా స్థలాన్ని ఎస్పీ సుబ్బారాయుడు పరిలించారు. ఘోర ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యలకు ఆస్తి గొడవలా? లేక అక్రమ సంబంధమా? అనే కోణంలో ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.