India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దగ్ధం ఘటనలో పోలీసులపై వేటు పడింది. సబ్ కలెక్టరేట్‌కు వన్ టౌన్ CI వల్లీబాషా పటిష్ఠ బందోబస్తు కల్పించలేదని గుర్తించిన ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం లేకపోవడం, అక్కడ పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం వంటి అభియోగాలను ఆయనపై మోపి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అలాగే మరో ఇద్దరు పీసీలను సస్పెండ్ చేశారని సమాచారం.
అన్నప్రసాదాల తయారీలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో ఈవో బుధవారం సమావేశం నిర్వహించారు. ఏపీ, టీఎస్‌కు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటికి మరమ్మతులు చేయాలని అక్కడి సిబ్బంది ఈవో దృష్టికి తీసుకెళ్లారు.
ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు 27వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ MLT పూర్తి చేసిన వారు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొత్తం 870 ఉద్యోగాలు ఉన్నట్లు చెప్పారు.
కడా కార్యాలయంలో పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్స్, వాచ్‌మెన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండు పోస్టులు ఖాళీలు ఉన్నాయని వివరించారు. తమ క్వాలిఫికేషన్లతోపాటు, ఉద్యోగ అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను projectdirectorekada@gmail.comకి పంపాలన్నారు.
TTD బోర్డు రద్దయింది. 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫీషియో మెంబర్లతో కూడిన బోర్డును గత YCP ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త ప్రభుత్వం రావడంతో TTD ఛైర్మన్ ఇప్పటికే రాజీనామా చేయగా.. ఇప్పుడు 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాల ఆమోదంతో TTDకి కొత్త ఛైర్మన్, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించుకోవాల్సి ఉంటుంది.
పాడిపేట పంచాయతీ శివపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆటో డ్రైవర్ నరేశ్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. కొన్ని రోజులుగా భార్య ధనలక్ష్మి, నరేశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో నరేష్ మృతి చెందడంతో స్థానికులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మే హరి అనే వ్యక్తితో కలిసి తండ్రిని దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు కుమార్తె నిదిశ్రీ పోలీసులకు తెలిపింది.
చిత్తూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు కృత్తిమ కాలు అమర్చేందుకు ఈనెల 26న ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. చెన్నైకు చెందిన ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరులోని రాస్(తపోవనం) వద్ద నిర్వహించే శిబిరంలో అర్హులు పాల్గొనేలా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.51వేలు విలువైన ఆధునిక వెయిట్ లెస్ కాలు ఉచితంగా అమర్చుతారని చెప్పారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ITI కళాశాలల్లో రెండో విడత ప్రవేశాల దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగియనుంది. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలి. ఇతర వివరాలకు iti.ap.gov.in వెబ్‌సైట్ చూడగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 24.
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం కంచిబందార్లపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించారు. ఆమె మట్లాడుతూ.. ఎక్కువ మెజారిటీ వచ్చిన బూత్‌ని తాను దత్తత తీసుకుంటానని ఎన్నికల సమయంలో చెప్పానన్నారు. మాట ప్రకారం కంచిబందార్లపల్లిని దత్తత తీసుకుంటున్నట్ల వెల్లడించారు. ఈ గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తానని చెప్పారు.
తిరుపతిలోని రాయల్ నగర్‌లో ఈనెల 18న జరిగిన జయలక్ష్మి వృద్ధురాలి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు కేసు వివరాలను వివరించారు. జయలక్ష్మి ఇంటి పక్కనే ఉండే శ్రీనివాసులును 2019లో అతని తండ్రి మందలించడంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఆ సమయంలో ఓ అమ్మాయిని తీసుకు వెళ్లిపోయాడని జయలక్ష్మి, ఆమె కుమార్తె రక్ష దుష్ప్రచారం చేశారు. కక్ష పెంచుకున్న శ్రీనివాసులు హత్య చేశాడు.
Sorry, no posts matched your criteria.