India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మదనపల్లె రైస్‌మిల్లు మాధవ రెడ్డి ఇంట్లో రెవెన్యూ సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మంత్రిని అడ్డుపెట్టుకొని ఆర్డీవో సహకారంతో మదనపల్లె డివిజన్లో రూ.కోట్ల విలువైన భూములను కైవసం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దగ్ధంలో కూడా ఆయన పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రేకలచేను గ్రామానికి చెందిన హేమంత్ (31) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ గుండెపోటుకు గురై పొలంలోని బురదలో కూరుకుపోయాడు. దీనిని గమనించి శునకాలు అరవసాగాయి. గుర్తించిన స్థానికులు అతనిని బయటకు తీశారు. మొదట కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు భావించగా అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు. షాక్ కొట్టలేదని నిర్ధారించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై సీఐడి చీఫ్ రవిశంకర్ రంగంలోకి దిగారు. మంగళవారం దర్యాప్తు బృందం కాలిన ఫైళ్లతో కూపీ లాగుతోంది. ఏయే విభాగాలకు చెందినవో గుర్తించేందుకు సేకరించిన ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సోమవారం మదనపల్లెకు వచ్చిన DGP, సీఐడీ చీఫ్, ఎస్పీ, కలెక్టర్.. ఫైళ్ల దగ్ధం యాక్సిడెంట్ కాదని ఇన్సిడెంట్ వల్ల జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై పూర్వ RDO మురళి, ప్రస్తుత RDO హరిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఒంగోలులో పనిచేసిన మురళిపై అవినీతి ఆరోపణ రావడంతో మదనపల్లె RDOగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడంతోపాటు MROగా రివర్షన్ సైతం ఇచ్చారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేత, రివర్షన్ ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మురళి తిరుపతి కలెక్టరేట్లో పనిచేస్తున్నారు.
మిస్ యూనివర్స్ తెలంగాణ, AP, కర్ణాటక స్టేట్ 1వ ఆడిషన్ ఫినాలే పోటీలు హైదరాబాదులోని శ్రీనగర్‌కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఇందులో శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్ మిస్ యూనివర్స్ ఏపీగా ఎంపికయ్యారు. శాంతిపురం(మం) ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన హైదరాబాద్‌లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేశారు. ఈ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధంపై విచారణ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణకు మరికొందరు అధికారులు వెళ్లనున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియాను వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇంజినీరింగ్ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్ రెండోవిడత ఆన్లైన్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కేటీరోడ్డులోని ఎస్వీప్రభుత్వ పాలి టెక్నిక్ హెల్ప్ లైన్ కేంద్రంలో ఈనెల 23 నుంచి 25వరకు మూడురోజులపాటు ఈ కౌన్సెలింగ్ జరగనుందని ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు.
లడ్డూ కౌంటర్, టీటీడీ రూములు కేటాయించే ఉద్యోగాలంటూ శ్రీలక్ష్మీశ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ పేరిట ఓ నోటిఫికేషన్ వైరల్ అవుతోంది. దీనిపై TTD స్పందించింది. ‘ఓ ఫేక్ నోటిఫికేషన్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అది ఫేక్ నోటిఫికేషన్. దానిని ఎవరూ నమ్మకండి’ అని TTD ట్వీట్ చేసింది.
కొత్త ప్రభుత్వ వచ్చాక 31 మందిని హత్యచేశారని ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసులు స్పందించారు. ‘జూన్ 4 నుంచి జులై 22 వరకు రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయి. అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీకి చెందినవారు. పాత కక్షలతో పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2హత్యలు జరిగాయి. మృతులు ఇద్దరూ YCPకి చెందిన వారు’ అని ఏపీ పోలీసులు ట్వీట్ చేశారు.
మదనపల్లెలో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగింది ప్రమాదం కాదని భావిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. మంటలు చెలరేగిన సమయంలో వీఆర్ఏ ఒక్కరే ఉన్నారని.. ఆయనే ఆర్డీవోకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఎక్కువ అవకతవకలకు అవకాశం ఉన్న సెక్షన్లోనే మంటలు చెలరేగడం అనుమానాలకు తావిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని.. షార్ట్ సర్క్యూట్‌కు తక్కువ అవకాశం ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.