EastGodavari

News May 17, 2024

తూ.గో.: భార్యను తిట్టాడని.. హత్య

image

తూ.గో. జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో దారుణ హత్య జరిగింది. SI రామారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పులగం సూర్యనారాయణ రెడ్డి(65) వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కాగా బుధవారం గ్రామానికి చెందిన శివారెడ్డి, అతని భార్యను దూషించాడు. దీంతో గురువారం రాత్రి గ్రామ శివారు దూడలపాకలో ఒంటరిగా ఉన్న సూర్యనారాయణరెడ్డిని శివారెడ్డి కర్రతో కొట్టి చంపాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేశామన్నారు.

News May 17, 2024

స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత: ఐజీ

image

స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన గురువారం కోనసీమ జిల్లా చెయ్యేరు ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూముల వద్ద చేపట్టిన భద్రతా చర్యలపై సమీక్షించారు. మూడంచెల భద్రతలో భాగంగా కేంద్ర సాయుధ బలగాలు, సివిల్ పోలీసులను అక్కడ ఉంచామన్నారు. పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ఎస్పీ శ్రీధర్, అధికారులు పాల్గొన్నారు.

News May 16, 2024

పిఠాపురం ప్రజలను ఉద్దేశించి పవన్ లేఖ

image

జనసేన అధ్యక్షులు పవన్ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి గురువారం ఓ లేఖ విడుదల చేశారు. ‘ఓటర్లు రాత్రి 10 గంటల వరకూ క్యూలైన్‌లో ఉండి రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు చేయడం మీ ప్రేమను తెలియజేస్తుంది. తాను పోటీ చేస్తానని తెలియగానే ఎంతో బలమైన కేడర్ ఉన్నప్పటికీ సీట్ త్యాగం చేసిన టీడీపీ ఇన్‌ఛార్జి వర్మసహకారం మరువలేనిది. నా కోసం పని చేసిన జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

News May 16, 2024

పిఠాపురం ఫలితంపై జోరందుకున్న ఊహాగానాలు

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మొత్తం 2,36,409 మందికి 2,04,811 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.63% పోలింగ్ జరిగింది. గొల్లప్రోలు రూరల్ మండలంలో 86.59 శాతం, నగర పంచాయతీలో 84.99, పిఠాపురం రూరల్ లో 88.62 శాతం, మున్సిపాలిటీలో 83.48 శాతం, యు.కొత్తపల్లిలో 87.35% పోలింగ్ జరిగింది.

News May 16, 2024

రాజమండ్రి : మార్గాని భరత్ బావమరిది మృతి

image

రాజమండ్రి వైసీపీ నియోజకర్గ అభ్యర్థి, పి.మార్గాని భరత్ రామ్ అత్తింట్లో విషాదం చోటుచేసుకుంది. రాజమండ్రిలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న భరత్ కు మద్దతుగా పనిచేసేందుకు నగరానికి వచ్చిన ఆయన పోలింగ్ ముగిసిన మరుసటి రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించగా బుధవారం మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News May 16, 2024

తూ.గో: తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు

image

ట్రాఫిక్ మరమ్మతుల కారణంగా పనుల కారణంగా విజయవాడ డివిజన్ మీదుగా నడిచే పలు రైళ్లను ఈనెల 26,27 తేదీల వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. రాజమండ్రి-విశాఖపట్నం, రాజమండ్రి-నర్సాపూర్, నిడదవోలు-నరసాపూర్, నర్సాపూర్-విజయవాడ, నర్సాపూర్-రాజమండ్రి, విశాఖపట్నం-గుంటూరుతో పాటు మరికొన్నింటిని రద్దు చేశామన్నారు.

News May 16, 2024

తూ.గో.: గతంలో కంటే తక్కువ పోలింగ్.. ఇక్కడే

image

తూ.గో. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 9 చోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే తాజా ఎన్నికల్లో తక్కువగా నమోదైంది. అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజానగరం, అమలాపురం, రామచంద్రపురం, రాజోలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, రంపచోడవరం నియోజకవర్గాల్లో దాదాపు 1 శాతం మేర పోలింగ్ తగ్గింది. మరి ఈ పరిణామం ఏ పార్టీకి దోహదపడుతుందన్న దానిపై ముందస్తుగానే ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.
– మరి మీ కామెంట్ ఏంటి..?

News May 15, 2024

పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో RECORD

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది. వెరసి గత ఎన్నికల్లో కంటే పోలింగ్ దాదాపు 5 శాతం మేర పెరిగింది. పిఠాపురంలో 2019- 81.26, 2024- 86.63, కాకినాడ సిటీలో 2019 67.09, 2024- 72.16 శాతం ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతం అధికంగా పెరిగిన నియోజకవర్గాలు ఇవే కావడం విశేషం.

News May 15, 2024

తూ.గో.: అప్పుడూ.. ఇప్పుడూ పోలింగ్ శాతం ఒకటే

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గ ఓటర్లు చైతన్యం చూపారు. మొత్తం 2,45,296 మంది ఓటర్లు ఉండగా.. 1,03,292 మంది పురుషులు, 1,01,476 మంది మహిళలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో 83.64 శాతం పోలింగ్ నమోదైంది. అయితే గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 83.64 శాతం ఓటింగ్ నమోదవడం విశేషం.

News May 15, 2024

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు‌పై బెట్టింగులు

image

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ గెలుపుపై జోరుగా పందేలు కాస్తున్నారు. జరిగిన పోలింగ్‌ ఫలితాల్లో పవన్‌ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని పలువురు బెట్టింగ్ వేస్తున్నారు. పవన్‌ గెలిస్తే రూ.లక్ష చెల్లిస్తామని.. ఒకవేళ వైసీపీ అభ్యర్థి గీత విజయం సాధిస్తే రూ.2 లక్షలు చెల్లించాలని ఉమ్మడి పార్టీల నాయకులు చెల్లించాలన్న ఒప్పందాలు చేసుకున్నట్టు సమాచారం. దీనిపై మీ కామెంట్..