EastGodavari

News June 11, 2024

అంతర్జాతీయ టోర్నీలో అమలాపురం విద్యార్థుల ప్రతిభ

image

భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నీలో అమలాపురం విద్యార్థులు ప్రతిభ కనపరిచారని అకాడమీ ప్రిన్సిపల్ వెంకట సురేష్ తెలిపారు. ఓపెన్ విభాగంలో కేశనకుర్తి రాజేష్, తాడి సాయివెంకటేష్ చెరో రూ.10 వేలు, ద్రాక్షారపు సాత్విక్ రూ.7 వేల నగదు బహుమతిని సొంతం చేసుకున్నారని చెప్పారు. ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జరిగిన పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి 300 మంది పాల్గొన్నారన్నారు.

News June 11, 2024

కోనసీమ: 3 రోజులు గరికపాటి ప్రవచనాలు

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలోని ధర్మగుండం చెరువు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22, 23వ తేదీల్లో మహ సహస్రావధాని గరికపాటి నరసింహారావు ప్రవచనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు సోమవారం తెలిపారు. శ్రీ సీతారామ కమ్యూనిటీ హాల్లో 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు.

News June 10, 2024

కాకినాడ: ACCIDENT.. యువకుడు దుర్మరణం

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని వెంగాయమ్మపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గోకవరం మండలం అరవపేట కాలనీకి చెందిన మండపాటి మణిరత్నం(33) బైక్‌పై జగ్గంపేట నుంచి గోకవరం వెళ్తుండగా వెంగాయమ్మపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  

News June 10, 2024

తూ.గో.: మంత్రి పదవి రేసులో ఎవరు..?

image

రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించిన నాటి నుంచి జనసేనలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో 21 స్థానాల్లో విజయం సాధించగా.. అందులో 11 స్థానాలు ఉభయ గోదారి జిల్లాల నుంచే ఉన్నాయి. జనసేనకు 5 మంత్రి పదవులు వస్తాయన్న తాజా టాక్ నేపథ్యంలో గోదారి జిల్లాల్లోని 11 స్థానాల్లో ఎంతమందికి మంత్రి పదవి వరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది.
మీరు ఏమనుకుంటున్నారు..?

News June 10, 2024

వాలంటీర్ల కష్టాలు.. కొత్త ప్రభుత్వంపై ఆశలు!

image

ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలనే EC ఆదేశాలతో వివాదం చెలరేగి చాలామంది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి పరిస్థితి ఎటూ తేలని చందంగా ఉంది. కోనసీమలో నగరపాలక సంస్థ, 6 మున్సిపాలిటీలు, 21 మండలాల పరిధిలో 11,273 మంది వాలంటీర్లకు 10వేల మంది రాజీనామా చేశారు. 3నెలలుగా పనులు లేక, జీతాలు అందక వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొత్త ప్రభుత్వంలో మంచిరోజులు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

News June 10, 2024

వన్నెపూడి ఘటనపై పవన్ సీరియస్..!

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని వన్నెపూడి ఘటనను జనసేనాని పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. జనసేన గెలుపునకు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి జరగడం సరికాదని, ఈ ఘటన వెనుక ఎవరున్నారు..? అనే దానిపై వివరాలు సేకరించాలని పవన్ ఆదేశించినట్లు నేతలు చెబుతున్నారు. వారంలో పవన్ పిఠాపురం రానున్నట్లు ఇప్పటికే నాగబాబు ప్రకటించారు.

News June 10, 2024

తూ.గో: డేంజర్ హైవే.. 17 నెలల్లో 104 మంది మృతి

image

ఉమ్మడి ప.గో-తూ.గో జిల్లాను కలుపుతూ గుండుగొలను నుంచి కొవ్వూరు వరకు దాదాపు 70KM పొడవున రూ.1800 కోట్ల వ్యయంతో నిర్మించిన హైవే ప్రమాదాలకు అడ్డాగా మారింది. హైవే ఎక్కాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ఈ రూట్‌లో దేవరపల్లి మండలం డేంజర్ స్పాట్. ఈ మార్గంలో 2023 JAN నుంచి 2024 మే వరకు (17 నెలలు) దాదాపు 156 ప్రమాదాలు జరగ్గా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలపాయ్యారు.

News June 10, 2024

కూర బాగోలేదంటూ భర్త కొట్టాడని భార్య సూసైడ్

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లికి చెందిన కుంచే గంగాభవాని(30) చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు ఆదివారం తెలిపారు. కూర బాగోలేదని భర్త కొట్టడంతో గంగాభవాని మనస్థాపం చెంది ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. దీనిపై జగ్గంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 10, 2024

తూ.గో: తెరుచుకోనున్న అన్న క్యాంటీన్‌లు

image

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్స్ తిరిగి తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్న క్యాంటీన్స్ తెరవనున్నట్లు టీడీపీ ఒక ప్రకటన విడుదుల చేసింది. రూ.5లకే నిరు పేదలకు అల్పాహారం అందించే ఉద్దేశ్యంతో 2014లో ఈ క్యాంటీన్స్ ప్రారంభించగా.. 2019లో వైసీపీ అధికారంలో రావడంతో అవి మూతపడ్డాయి. ఇప్పుడు తిరిగి తెరుచుకోనుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 10, 2024

నేడే ‘కల్కి’ ట్రైలర్.. తూ.గో జిల్లాలో థియేటర్లు ఇవే

image

ప్రభాస్‌ అభిమానులు‌ ఎంతో‌ ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘కల్కి 2898-AD’ ట్రైలర్‌ నేడు విడుదల కానుంది. ఉమ్మడి తూ.గో జిల్లా అభిమానుల కోసం పలు థియేటర్లలో‌ సోమవారం 6PMకు ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. రాజమండ్రి- సూర్య ప్యాలెస్, కాకినాడ-లక్ష్మి, అమలాపురం- వెంకట పద్మావతి, రావులపాలెం- అక్షర, మండపేట-కృష్ణ థియేటర్‌లలో‌ ట్రైలర్‌ స్కీనింగ్ చేస్తారు. SHARE IT..