India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా కే.గంగవరం మండలం బాలాంత్రం లాకుల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి ఎరుపు అక్షరాలతో ఉత్తరం రాసి చేతికి తగిలించారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో హుటాహుటిన క్లూస్ టీంతో చేరుకొని పరిశీలిస్తున్నారు. విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు.
ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేనకు ఒక కేబినెట్ పదవి ఇచ్చే వీలుంది. కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌కి కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఖాయమైనట్టు ఆ పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జిల్లా ప్రజలంతా ఆయనకు మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు. ఆయన ద్వారా కాకినాడ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా, పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటకు చెందిన రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి పేరి కామేశ్వరరావు (పీకే రావు) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కార్పొరేషన్ సెక్రటరీకి పంపినట్లు తెలిపారు.
తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ- కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. దీంతో బీచ్ రోడ్డు శనివారం కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీర ప్రాంత ప్రజల రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మాజీ మంత్రి, స్వర్గీయ జక్కంపూడి రామ్మోహనరావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు (చిన్ని) శనివారం కన్ను మూశారు. ఆయన వయస్సు 63 సంవత్సరాలు గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్ని మరణ వార్తతో జక్కంపూడి అభిమానులు నారాయణపురంలోని వారి నివాసానికి చేరుకుని చిన్ని పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
తుఫాను ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గ పరిధి ఉప్పాడ- కాకినాడ మధ్య సముద్ర తీర ప్రాంతం మరోసారి అతలాకుతలమైంది. బీచ్ రోడ్డు కోతకు గురైంది. తీర ప్రాంతంలోని ఆరుగురు మత్స్యకారుల గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో వారు ఆందోళనకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తీర ప్రాంత ప్రజల రక్షణకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పాత్రికేయ రంగంలో చెరగని ముద్రవేసిన ఈనాడు అధినేత రామోజీరావు మరణవార్త ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందీశ్వరి సంతాపం ప్రకటించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. సినీరంగంలో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీ రావు అని.. ఆయన లేరన్న వార్త తెలుగుజాతిని శోకసంద్రంలో ముంచి వేసిందన్నారు.
భావనగర్- కాకినాడ పోర్టుకు వచ్చే రైలును దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. సాధారణంగా విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకునే ఈ రైలు ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో విజయవాడ, గుడివాడ, నిడదవోలు స్టేషన్ల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక నుంచి రావులపాలెం వెళ్ళే రహదారిలో ఈనెల 8, 9 తేదీల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నట్లు రావులపాలెం సీఐ ఎం.రామకుమార్ తెలిపారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ నిమిత్తం ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు చెప్పారు. బొబ్బర్లంక నుంచి రావులపాలెం వైపు వచ్చే వాహనాలు ధవళేశ్వరం బ్యారేజ్ దాటుకుని వేమగిరి, కడియం, జొన్నాడ – రావులపాలెం చేరుకోవాలన్నారు
కోనసీమ జిల్లాలో కొందరు నేతలు పార్టీ మారి పోటీ చేసినా గెలవలేదు. TDP నుంచి YCPలో చేరి మండపేట బరిలో దిగిన త్రిమూర్తులు.. JSP నుంచి YCPలో చేరి అమలాపురం MP అభ్యర్థిగా దిగిన రాపాక.. TDPని వీడి YCP తరఫున రాజోలు నుంచి పోటీ చేసిన గొల్లపల్లి.. YCP టికెట్ దక్కక కాంగ్రెస్‌లో చేరిన చిట్టిబాబు ఈ ఎన్నికల్లో ఓటమి మూట కట్టుకున్నారు. కాగా.. YCP నుంచి TDPలో చేరిన వాసంశెట్టి మాత్రమే రామచంద్రపురంలో గెలిచారు.
Sorry, no posts matched your criteria.