India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 3 లోక్‌సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికల్లో ప్రధానంగా కూటమి, వైసీపీ మధ్యనే పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్‌తో పాటు స్వతంత్రులు కనీస ప్రభావం చూపలేకపోయారు. కూటమి, వైసీపీ మినహా మిగిలిన అభ్యర్థులెవరూ డిపాజిట్లు దక్కించుకోలేకపోయారు. కాకినాడ జిల్లాలో 92 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 97 మంది, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 20 మంది, వెరసి 254 మంది డిపాజిట్లు కోల్పోయారు.
వైసీపీ ఓటమిపై కాకినాడ గ్రామీణ మండలం రాయుడిపాలేనికి చెందిన ఆరుద్ర ఆనందం వ్యక్తం చేశారు. ఈమె గతంలో CM కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా ఆమె కొంతకాలం క్రితం రాష్ట్రాన్ని వీడి వారణాసికి వెళ్లిపోయారు. ‘ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు.. వారంతా నాకు మద్దతు ఇచ్చేలా చంద్రబాబును నిలబెట్టారు. మాకు జరిగిన అన్యాయంపై రాష్ట్రానికి వచ్చి వారిని కలుస్తాను’ అని పేర్కొన్నారు.
పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌కు రాజకీయాలు కలిసిరాలేదనడానికి తాజా ఓటమి బలం చేకూరుస్తోంది. తొలిసారి 2009లో కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పరాజయం పొందారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి బరిలో నిలవగా..37.06 శాతం ఓటింగ్‌తో మళ్లీ ఓటమి తప్పలేదు. ఈయన మొత్తం 4 సార్లు పోటీ చేయగా.. 3 పార్టీల నుంచి బరిలో నిలవడం గమనార్హం.
ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం పిఠాపురం రాజుగారి కోటలోని వైసీపీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన YS.జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున తమన్నా సింహాద్రి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు 247 ఓట్లు వచ్చాయి. అయితే ఇక్కడి నుంచి పోటీ చేసిన 13 మందిలో ఈమెకు వచ్చిన ఓట్లే అతి తక్కువ. ఇక పవన్ 1,34,394 ఓట్లు సాధించి.. 70,279 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన వరసల ముత్యాలరావు సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టాడని, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ విధమైన నేరాలకు ఎవరు పాల్పడినా కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి విజయకేతనం ఎగురవేయడంతో పలువురు వైసీపీ నేతలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు వారి పదవులకు రాజీనామా చేస్తున్నారు. డా.అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైసీపీ ఉపాధ్యక్ష పదవికి అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామానికి చెందిన వూటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాజీనామా చేసినట్లు గురువారం ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలిపారు.
దేవీపట్నం మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన గర్భిణి జోగమ్మ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ప్రసవించింది. వైద్యసేవల అనంతరం తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్ వాహనంలో ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో అకూరు గ్రామం వద్ద రోడ్డుపై వదిలి వెళ్లిపోయారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 చెల్లించి ఆటోపై ఆమె చింతలగూడెం గ్రామానికి వెళ్లారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడం దశాబ్దాల ఆనవాయితీ. తాజా ఎన్నికల్లోనూ అదే నిజమైంది. 1952 నుంచి 2019 వరకు అధికారం చేపట్టిన పార్టీలన్నీ తూ.గో.లో అత్యధిక స్థానాలు దక్కించుకున్నవే. ఇక 1983లో టీడీపీ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి తూ.గో.లో పోటీ చేయగా.. అప్పుడు 21 స్థానాల్లో ప్రతిపక్షాలకు ఒక్కసీటు దక్కకుండా టీడీపీకే పట్టం కట్టారు.
పిఠాపురంలో పవన్‌పై పోటీగా జైభీమ్ భారత్ పార్టీ తరఫున 9 డిగ్రీలు చేసిన జగ్గారపు మల్లికార్జున రావు MLAగా బరిలో నిలుపుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పోటీలో నిలిచిన మల్లికార్జున రావుకు కేవలం 594 ఓట్లు రాగా 6వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.