India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని ముగ్గురు వైసీపీ మంత్రులనూ ఓటర్లు ఆదరించలేదు. రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం నుంచి పినిపే విశ్వరూప్, తుని నుంచి దాడిశెట్టి రాజా ఓటమి చవి చూశారు. చెల్లుబోయినకు ఈ ఎన్నికల్లో 64,970 ఓట్లు (2019లో 75,365), పినిపేకు 65,394 ఓట్లు (2019లో 72,003), దాడిశెట్టికి 82,029 ఓట్లు (2019లో 92,459) వచ్చాయి.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 స్థానాల్లో గెలుపొందిన MLAలలో 40ఏళ్ల లోపు వారు ఇద్దరు కాగా.. 70 ఏళ్ల పైబడి ముగ్గురు ఉన్నారు. మోస్ట్ సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఆయన ప్రస్తుతం 7వ సారి MLAగా గెలిచారు.
☛ రంపచోడవరం- మిరియాల శిరీషాదేవి(30)
☛ తుని- యనమల దివ్య(40)
☛ పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప (71)
☛ జగ్గంపేట- జ్యోతుల నెహ్రూ(73)
☛ రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి(78)
రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘన విజయం సాధించారు. అదే కుటుంబం నుంచి శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు MLCగా, తల్లి వీరరాఘవమ్మ మేయర్‌గా పనిచేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ భార్య భవాని 2019లో YCP హవాలోనూ TDP నుంచి MLAగా గెలిచారు. ప్రస్తుతం ఆదిరెడ్డి వాసు తూ.గో జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో బంపర్ మెజార్టీ(71,404+)తో గెలిచారు. ఈ కుటుంబంలో నలుగురు ప్రజాప్రతినిధులుగా సేవ చేయడం విశేషం.
కాకినాడ MP అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(జనసేన) బంపర్ మెజార్టీతో గెలిచారు. ఉదయ్‌కి 7,29,699 ఓట్లు, చలమలశెట్టి(YCP)కి 5,00,208 ఓట్లు రాగా.. 2,29,491 ఓట్ల మెజార్టీతో ఉదయ్ విజయం సాధించారు. కడియంకు చెందిన ఉదయ్ విదేశాల్లో పలు IT సంస్థల్లో పని చేశారు. 2015లో జాబ్ మానేసి ‘TEA TIME’ బిజినెస్ స్టార్ట్ చేశారు. తాజా ఫలితాల్లో కాకినాడ పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో రికార్డ్ తిరగరాశారు.
వంగా గీత తొలిసారి ఓటమి చెందారు. 1983లో రాజకీయాల్లో ప్రవేశించి 1985-87 వరకు మహిళా శిశు రీజినల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1995లో కొత్తపేట ZPTCగా గెలిచారు. 1995-2000 వరకు తూ.గో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున MLAగా, 2019లో YCP నుంచి కాకినాడ MPగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పవన్ చేతిలో 70,279 ఓట్ల తేడాతో ఓడారు.
ఉమ్మడి తూ.గో ప్రజలు కూటమికి స్పష్టమైన గెలుపునిచ్చారు. 19 నియోజకవర్గాల్లో ఎక్కడా YCP ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో బావ-బావమరిది సత్తాచాటారు. రాజమండ్రి సిటీ TDP అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ YCP అభ్యర్థి మార్గాని భరత్‌పై 71,404+ ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆదిరెడ్డి బావమరిది కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం MPగా గెలిచారు. రామ్మోహన్ నాయుడి సోదరినే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు.
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు హవా చూపించారు. అన్నిచోట్ల స్పష్టమైన మెజారిటీతో ఘన విజయం సాధించి జిల్లాను క్లీన్ స్వీప్ చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాశారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, కొత్తపేట నియోజకవర్గాల్లో 1999లో గెలిచిన TDP ఆపై ఎప్పుడూ గెలవలేదు. దాదాపు 25 ఏళ్ల తర్వాత తాజాగా టీడీపీ పాగా వేసింది.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ సిట్టింగ్ MLA కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీచేసి డిపాజిట్ కోల్పోయారు. ఆయనకు కేవలం 1,526 ఓట్లు మాత్రమే వచ్చాయి. నోటాకు 1,751 ఓట్లు వచ్చాయి. దాని కన్నా తక్కువ ఓట్లు చిట్టిబాబుకు రావటం గమనార్హం. 2014లో పి.గన్నవరం నుంచి YCP అభ్యర్థిగా చిట్టిబాబు పోటీచేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించారు.
అమలాపురం ఎంపీగా టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ 3,42,196 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బాలయోగి కుటుంబం నుంచి 3వ ఎంపీగా ఆయన చరిత్ర సృష్టించారు. హరీష్ తండ్రి బాలయోగి 1994, 1999లో అమలాపురం MPగా గెలిచారు. లోక్‌సభ స్పీకర్‌గానూ సేవలందించారు. ఇక 2002లో ఆయన మృతి తర్వాత ఉప ఎన్నికలో సతీమణి విజయకుమారి గెలుపొందారు. 2019లో కుమారుడు హరీష్ పోటీచేసినా ఓటమి చెందారు.
➤ SHARE IT
తూ.గో. జిల్లాలోని మొత్తం 19 స్థానాల్లో గెలిచిన MLAలలో 9మంది తొలిసారే కావడం విశేషం.
– పిఠాపురం- పవన్ కళ్యాణ్
– కాకినాడ గ్రామీణం- పంతం నానాజీ
– రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
– రాజోలు- దేవ వరప్రసాద్
– పి.గన్నవరం- గిడ్డి సత్యనారాయణ
– రామచంద్రపురం- వాసంశెట్టి సుభాష్
– రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి శ్రీనివాస్
– తుని – యనమల దివ్య
– రంపచోడవరం – శిరీష
– వరుపుల సత్యప్రభ – ప్రత్తిపాడు
➤ SHARE IT
Sorry, no posts matched your criteria.