EastGodavari

News May 9, 2024

తూ.గో: ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఉందని రాజమహేంద్రవరం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆర్ఐసీహెచ్వీఎస్ నరసింహం బుధవారం తెలిపారు. అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు పదో తేదీ వరకు మాత్రమే గడువు ఉందన్నారు. తత్కాల్ స్కీంలో ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News May 9, 2024

తూ.గో: ఈ నెల 11 నుంచి మూతపడనున్న మద్యం షాపులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం ప్రియుల్లో హైరానా మొదలైంది. దీంతో ఇప్పటి నుంచే మందుబాబులు జాగ్రత్త పడుతున్నారు. కాకినాడ జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 21 బార్లు ఉన్నాయి. తూ.గో జిల్లాలో 145 మద్యం దుకాణాలు, 27 బార్లు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 100 మద్యం దుకాణాలు, ఆరు బార్లు ఉన్నాయి.

News May 9, 2024

పిఠాపురంలో ఈనెల 10న పవన్ రోడ్‌షో

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 10న పిఠాపురం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. కాగా అదే రోజు సీఎం జగన్ సభ ఉండడంతో మొదట అనుమతికి ఇవ్వడానికి ఆలోచించిన అధికారులు జగన్ సభ వాయిదా పడడంతో పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోడ్ షో ఉండనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.

News May 9, 2024

తూ.గో: ఇద్దరికీ 117 మార్కులు.. కవలల ప్రతిభ

image

పాలీసెట్ ఫలితాల్లో మామిడికుదురు మండలం మాకనపాలెం గ్రామానికి చెందిన కవలలు భూపతి శ్రీ నిశాంత్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని సోదరుడు భూపతి శ్రీనిహాంత్ రెండో ర్యాంకు సాధించాడు. నిశాంత్ రాష్ట్ర స్థాయిలో 71, నిహాంత్ 87వ ర్యాంకు సాధించారు. ఇద్దరికీ సమానంగా 117 మార్కులు వచ్చాయి. పదో తరగతి పరీక్షల్లో ఇద్దరు తెలుగు, మాథ్స్, సోషల్ సబ్జెక్టులో 100 మార్కులు రావడం విశేషం.

News May 9, 2024

వదినమ్మ గెలుపు కోసం ఆడపడుచు ప్రచారం

image

ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాకు మద్దతుగా తన ఆడపడుచు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ కూటమి మేనేఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News May 8, 2024

అనారోగ్యంతో ఏఎస్సై మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఏఎస్సైగా పని చేస్తున్న ఎన్.కుశలన్నదొర అనారోగ్యంతో మృతి చెందారని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా… ఆయనకు ఫీట్స్ వచ్చి అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆయన స్వగ్రామం గంగవరం మండలం లొద్దిపాలెం అని తెలిపారు.

News May 8, 2024

రోడ్డు ప్రమాదం.. తండ్రి మృతి, కుమారుడికి గాయాలు

image

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బూరుగుపూడి నుంచి జగ్గంపేట వైపు బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సడెన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి డివైడర్‌పై పడి, తలకు బలమైన గాయమవడంతో వ్యక్తి స్పాట్‌లోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్వల్ప గాయాలైన కుమారుడిని హైవే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 8, 2024

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ (Rewind)

image

1962 నాటికి రాజోలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. అప్పుడు గడ్డం మహలక్ష్మి 30,460 ఓట్లతో కాంగ్రెస్ MLA గా గెలిచారు. అదే సమయంలో పక్క నియోజకవర్గం నగరంలో మామిడికుదురుకు చెందిన నయినాల గణేశ్వరరావు కూడా విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో రాజోలు జనరల్‌గా, నగరం ఎస్సీ నియోజకవర్గంగా మారిపోయాయి. దీంతో మహాలక్ష్మిని నగరం నుంచి, గణేశ్వరరావును రాజోలు నుంచి కాంగ్రెస్ బరిలో దింపగా.. అప్పుడూ ఇద్దరు గెలిచారు.

News May 8, 2024

కాకినాడ: బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కాకినాడ జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5-18 ఏళ్లలోపు బాలలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రధానం చేసేందుకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు కో డైరెక్టర్ ప్రవీణ మంగళవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, సాహిత్యం, సంగీతం, నృత్యం తదితర వాటిలో ప్రతిభ చూపిస్తున్న బాలలు జూలై 31 లోగా ఆన్లైన్ దరఖాస్తులు పంపాలన్నారు.

News May 8, 2024

పిఠాపురంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ..?

image

వైసీపీలో చేరిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఆమె కుమార్తె క్రాంతి వ్యవహారం సొంత జిల్లాలో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. సొంత కూతురే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడంతో వైసీపీలో కలవరం మొదలయ్యింది. పిఠాపురంలో వైసీపీ విజయానికి కలసివస్తారని భావించిన ముద్రగడ ఇప్పడు తమకు ఇబ్బందికరంగా మారడంతో వంగా గీతా వర్గం డైలమాలో పడినట్లు తెలుస్తోంది.