India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మొత్తం 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 18 రౌండ్లకు గానూ 69,169 ఓట్లు మెజార్టీ లభించగా.. పోస్టల్ బ్యాలెట్లు 1671 వచ్చాయి. దీంతో మొత్తం పవన్ కళ్యాణ్‌కు 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. తొలి రౌండ్ నుంచి పవన్ భారీ ఆధిక్యతతో దూసుకెళ్లగా.. వంగా గీత ఓటమిని చవిచూశారు.
అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున బరిలో దిగిన గంటి హరీష్ మాధుర్ 2,24,164 ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నారు.
ఆయనకు మెత్తం 4,98,610 ఓట్లు పోల్ కాగా.. వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌కు 2,74,446 పోలయ్యాయి. మొదటి నుంచి గంటి హరీష్ మాధుర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన తరఫున బరిలో దిగిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 1,48,775 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కలిపి ఉదయ్‌కి మొత్తం 520,192 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 3,71,417 ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బోణీ కొట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి టికెట్ రాజానగరం. ఇక్కడ కూటమి తరఫున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలి టికెట్ ఈయనదే, విజయం ఈయనదే కావడం విశేషం
ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపులు తేలిపోతున్నాయి. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ (టీడీపీ) 65,400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించార. అనపర్తి నుంచి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బోణీ కొట్టారు. తొలి విజయం నమోదు చేశారు. 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 61,564 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఈయన 10వసారి పోటీ చేయగా.. 7వ సారి MLAగా గెలిచారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయినకు 60,102 ఓట్లు వచ్చాయి.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 32,834 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి హరీష్ మాధుర్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఎక్కడ వైఎస్ఆర్సిపి తరఫున రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పోటీ చేశారు.
నాలుగు రౌండ్లు ముగిసేసరికి పవన్ కళ్యాణ్ సుమారు 20వేల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 18 రౌండ్లకు గాను 4 రౌండ్లు పూర్తయ్యాయి. ఇంకా 14 రౌండ్లు మిగిలి ఉన్నాయి. రౌండ్ల వారీగా పవన్‌కు ఓట్లు ఇలా… 1వ రౌండ్-4196, 2వ రౌండ్-3811, 3వ రౌండ్-5497, 4వ రౌండ్- 5640 ఓట్లు వచ్చాయి. 14రౌండ్ల లోనూ ఇదే రీతిలో కొనసాగితే 60 వేలకు పైనే మెజార్టీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పోస్టల్ బ్యాలెట్లలో కాకినాడలోని 7 నియోజకవర్గాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కాకినాడ MP అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ 9,530 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. ఈయనకు 30,779 ఓట్లు రాగా.. YCP అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌కు 21,249తో వెనుకంజలో ఉన్నారు. కాకినాడ-వనమాడి, కాకినాడ రూరల్-పంతం నానాజీ, పిఠాపురం-పవన్, ప్రత్తిపాడు-సత్యప్రభ, పెద్దాపురం- చినరాజప్ప, తుని- దివ్య, జగ్గంపేట- నెహ్రూ ముందంజలో ఉన్నారు.
పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 12,065 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ పవన్ మొదటి నుంచి ఆధిక్యం కనబరుస్తున్నారు.
Sorry, no posts matched your criteria.