EastGodavari

News May 6, 2024

రాజమండ్రి నుంచే చరిత్ర లిఖించబోతున్నాం: మోదీ

image

రాజమండ్రి నుంచే సరికొత్త చరిత్ర లిఖించబోతున్నామని ప్రధాని మోదీ అన్నారు. వేమగిరి ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. చంద్రబాబు సమయంలో ఏపీ అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉండేదని చెప్పారు. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పిందంటూ విమర్శించారు.
– మోదీ వ్యాఖ్యలపై మీ కామెంట్..?

News May 6, 2024

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కావడం నా అదృష్టం: పురంధీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ అభ్యర్థి కావడం తన అదృష్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి అన్నారు. రాజమండ్రిలోని వేమగిరిలో ప్రజాగళం సభలో ఆమె మాట్లాడుతూ.. చారిత్రక ఘట్టానికి రాజమండ్రి సాక్షిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారని, సుపరిపాలనకు కూటమి దోహదపడుతుందన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.

News May 6, 2024

రాజమండ్రికి చేరుకున్న మోదీ

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాజమండ్రికి చేరుకున్నారు. కడియం మండలంలోని వేమగిరిలో ఏర్పాటుచేసిన ప్రజాగళం బహిరంగ సభకు కాసేపట్లో వెళ్లనున్నారు.

News May 6, 2024

సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో దాడి.. జనసేన స్పందన

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో హీరో సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఆదివారం రాత్రి జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు జనసేన నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదలైంది. దానిలో.. ‘వైసీపీ మార్క్ రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే ఉపేక్షించం. YCP అల్లరిమూకల దాడిలో జనసైనికుడు శ్రీధర్ తలకు గాయంకావడం బాధాకరం. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు చూస్తూ ఉండటం ఎంతవరకు సమంజసం?’ అని ఉంది.

News May 6, 2024

భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య.. జడ్డంగిలో ఘటన

image

రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన బొమ్మసాని నాగేశ్వరావు(55) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రఘునాథరావు సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసగా మారి ఇంటి బాధ్యతలు పట్టించుకోకపోవడంతో భార్య మందలించింది. క్షణికావేశంతో అతడు పురుగు మందు తాగగా, కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News May 6, 2024

ప్రధాని మోదీ సభ.. వెహికిల్స్ పార్కింగ్ ఇలా..

image

వేమగిరిలో ప్రధాని మోదీ బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను నిర్దేశిత స్థలాల్లోనే పార్కింగ్ చేయాలని పోలీసులు పలు సూచనలు చేశారు. డయాస్ పాస్ కలిగిన నేతల వాహనాలు వేమగిరి జంక్షన్ విందు రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రాంతంలో పార్కింగ్ ‌చేయాలన్నారు. వీవీఐపీ పాసులు కలిగిన వాహనాలు 4ఏ వద్ద, విజయవాడ వైపు నుంచి వచ్చే బస్సులు పార్కింగ్-3లో, ఇతర కార్లు, ఆటోలు, బైక్స్ పార్కింగ్-1, 3 స్థలాల్లో నిలపాలన్నారు.

News May 6, 2024

కాకినాడ: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

image

కాకినాడ జిల్లా తొండంగిలో విషాదం నెలకొంది. భార్యాభర్తలు పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ భర్త మృతి చెందినట్లు ఎస్సై వినయ్ ప్రతాప్ తెలిపారు. లోకారెడ్డి శ్రీనివాస్(30)-సౌజన్యకు ఏడాది కింద వివాహమైంది. ఆర్థిక సమస్యలతో వీరిద్దరూ రెండ్రోజుల కింద ఇంట్లోనే సూసైడ్‌కు యత్నించారు. కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా.. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ భర్త శ్రీనివాస్ మృతి చెందాడు. సౌజన్య చికిత్స పొందుతుంది.

News May 6, 2024

రాజమండ్రికి ప్రధాని మోదీ.. రూట్ మ్యాప్ ఇదే

image

ప్రధాని మోదీ రాజమండ్రి టూర్‌కు సంబంధించి రూట్ మ్యాప్ ఇలా ఉంది. 1:35 PMకు మోదీ ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 2:25కు రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడి నుంచి 2:50కి వేమగిరిలోని హెలిప్యాడ్‌కు వస్తారు. 2:55కు రోడ్డు మార్గాన బయలుదేరి 3 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 3:45 వరకు వేదికపై ఉంటారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి 3:55కి హెలిప్యాడ్‌కు చేరుకొని అనకాపల్లి వెళ్తారు.

News May 6, 2024

నేడు రాజమండ్రికి ప్రధాని.. సభా వేదిక విశేషాలివి

image

రాజమండ్రిలో నేడు ‘విజయ శంఖారావం’ పేరిట నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. 60 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. ప్రాంగణంలో 50వేల మంది, వేదికపై 44 మంది ఆశీనులు అయ్యేట్లు ఏర్పాట్లు చేశారు. మోదీతో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, పురందీశ్వరి, కాకినాడ, అమలాపురం, ఏలూరు, నరసాపురం MP అభ్యర్థులు, రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఏడుగురు MLA అభ్యర్థులకు స్థానం కల్పించనున్నారు.

News May 6, 2024

6,927 మంది ఉద్యోగులు ఓట్లేశారు: కలెక్టర్ శుక్లా

image

పోలింగ్ విధులకు కేటాయించబడిన ఉద్యోగులు, సిబ్బంది ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,927 మంది ఉద్యోగులు, సిబ్బంది వారి ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మొత్తం 11,671 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు.