EastGodavari

News June 4, 2024

2019లో 223 మంది.. ప్రస్తుతం 254 మంది

image

సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 254 మంది పోటీలో నిలిచారు. 2019 ఎన్నికల్లో 19 నియోజకవర్గాల పరిధిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా కాకినాడ నగరం, గ్రామీణం, ప్రత్తిపాడు, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి 15 మంది వంతున అభ్యర్థులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేశారు.

News June 3, 2024

ఉప్పెన మూవీ డైరెక్టర్‌కు నాగబాబు పరామర్శ

image

ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబును జనసేన రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు ఈరోజు పరామర్శించారు. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోని బుచ్చిబాబు ఇంటికి నాగబాబు వెళ్లారు. ఇటీవల బుచ్చిబాబు తండ్రి వెంకట్రావు (పెద్దకాపు) అనారోగ్యంతో మృతి చెందగా.. నాగబాబు వెళ్లి బుచ్చిబాబును ఓదార్చారు. ఆయన వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు

News June 3, 2024

తొలిఫలితం తేలేది కొవ్వూరు, నరసాపురంలోనే..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. అత్యల్పంగా 13 రౌండ్స్ ఉండటంతో ఇక్కడే త్వరగా ఫలితం వెల్లడికానుంది. రంపచోడవరం ఫలితం చివరగా వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి, నరసాపురం ఎంపీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లలో ఫలితం వెల్లడి కానుండగా.. అమలాపురం ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 27 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది.

News June 3, 2024

ఘోరం.. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు

image

గంగవరం మండలం నూగుమామిడిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తలను గోడకు కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదమ్మ(51) అకౌంట్‌లో డబ్బులు ఉండగా, అవి విత్‌డ్రా చేసి ఇవ్వాలని కొడుకు కృష్ణ ఆమెతో గొడకు దిగాడు. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమె బలంగా గోడకు నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాగుడుకు బానిసై తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడని తెలిపారు.

News June 3, 2024

తూ.గో: RTV సర్వే.. TDP-10, YCP-04, JSP-05

image

పిఠాపురం-పవన్, తుని- దాడిశెట్టి, ప్రత్తిపాడు-సత్యప్రభ, కాకినాడ(సి)-వనమాడి, కాకినాడ(రూ)-నానాజీ, పెద్దాపురం-చినరాజప్ప, జగ్గంపేట-నెహ్రూ, రాజానగరం-బత్తుల, రాజమండ్రి(రూ)- గోరంట్ల, రాజమండ్రి(సి)-వాసు, అనపర్తి-సూర్యనారాయణ, రంప-ధనలక్ష్మి, కొత్తపేట-బండారు, మండపేట-వేగుళ్ల, రామచంద్రపురం-సూర్యప్రకాశ్, అమలాపురం-ఆనందరావు, రాజోలు-దేవవరప్రసాద్, ముమ్మిడివరం-సుబ్బరాజు, పి.గన్నవరం-గిడ్డి గెలుస్తారని అంచనా వేసింది.

News June 3, 2024

తూ.గో.: బరిలో 25 మంది మహిళలు

image

ఉమ్మడి తూ.గో.లో MP, MLA స్థానాల నుంచి 25మంది మహిళలు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి. రాజమండ్రి పార్లమెంట్‌కు పురందీశ్వరి (BJP), బాల నవీన (స్వతంత్ర), కాకినాడ పార్లమెంట్‌కు అనూష యాదవ్ (BCYP) పోటీ చేశారు. కోనసీమ జిల్లాలో కొత్తపేట నుంచి ఒకరు, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు అసెంబ్లీలకు ఇద్దరు చొప్పున పోటీచేశారు. కాకినాడ, తూ.గో. జిల్లాలో 16 మంది పోటీ చేశారు.

News June 3, 2024

ఇంటర్నేషనల్ పోటీల్లో గోదారి కుర్రోడు

image

ఈ నెల 19 నుంచి 23 వరకు నార్త్ అమెరికా లోవాసిటీలో థాయ్‌బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. 80 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు భారత్ తరఫున 86 కేజీల విభాగంలో పాల్గొనేందుకు రాజోలుకు చెందిన అశోక్ ఎంపికయ్యాడు. కాగా ఆయన్ను న్యూఢిల్లీ, పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సత్కరించి రూ.75 వేల ఆర్థికసాయం అందించారు.
☛ CONGRATS అశోక్

News June 3, 2024

తూ.గో.: ఐదుకు చేరిన మృతుల సంఖ్య

image

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద గత నెల 27న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ ప్రమాదంలో గాయపడిన సత్య (30) విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, భార్య సత్య, కుమార్తె రాధాప్రియ, కుమారుడు రాకేష్, బంధువు గోపితో కలిసి కారులో వెళ్తూ లారీని ఢీ కొట్టి ట్రాలీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

News June 3, 2024

పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ: వర్మ

image

జూన్ 4వ తేదీన వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో జనసేన అధినేత, పిఠాపురం  కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్‌కు 60 వేల మెజారిటీ ఖాయమని మాజీ MLA ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం మండలం కోలంకలో పర్యటించిన ఆయన గాజుగ్లాసులో టీ తాగి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ కూటమిదే విజయమని చెప్పాయన్నారు. అలాగే, పవన్ గెలుపు కూడా ఖాయమని చెప్పినట్లు గుర్తుచేశారు.

News June 3, 2024

తూర్పు గోదావరి జట్టుపై విశాఖ విజయం

image

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.