India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డ్రైడేగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. 5వ తేదీ వరకు మద్యం విక్రయాలు నిర్వహించరాదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆరా సంస్థ సర్వేతో పాటు ఇతర సర్వేల్లోనూ అదే చెప్పారు. దీంతో అందరి దృష్టి పవన్ మెజారిటీపై పడింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని కూటమి పార్టీ నేతలు చెబుతుండగా.. తమదే విజయం అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.
– మీ కామెంట్..?
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి MP స్థానాల్లో YCP, అమలాపురంలో TDP విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా కాకినాడలో కూటమి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ బరిలో ఉన్నారు. అటు రాజమండ్రిలో కూటమి- పురందీశ్వరి, వైసీపీ- గూడూరి శ్రీనివాస రావు, అమలాపురంలో కూటమి నుంచి గంటి హరీశ్ మాధుర్, వైసీపీ- రాపాక వరప్రసాద్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?
ట్రాఫిక్ నిర్వహణ పనుల నిమిత్తం శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 2 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరం- విజయవాడ (07767), విజయవాడ- రాజమహేంద్రవరం (07459) రైళ్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
– SHARE IT
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో 10 టీడీపీ, వైసీపీ ఒక చోట విజయం సాధిస్తుందని చాణక్య ఎక్స్ సర్వే సంస్థ అంచనా వేసింది. కాగా.. తుని, అనపర్తి, రాజానగరంలో YCPకి, కాకినాడ రూరల్, పి.గన్నవరంలో జనసేనకు, రామచంద్రపురంలో TDPకి ఎడ్జ్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇక కాకినాడ సిటిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుందని చెప్పింది.
రాష్ట్రంలో పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు శనివారం వెల్లడించడంతో ఉమ్మడి తూ.గో. జిల్లాలో గెలుపు అవకాశాలపై ఒక అంచనా ఏర్పడిందని చర్చ సాగుతోంది. 19 అసెంబ్లీ స్థానాలకు గానూ చాణక్య స్ట్రాటజీస్, పోస్ట్ పోల్, కేకే తదితర సంస్థలు కూటమే ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పాయి. తుది ఫలితాలకు నేడు, రేపు మాత్రమే మిగిలి ఉండగా ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.
– సర్వే ఫలితాలపై మీ కామెంట్..?
ఉమ్మడి తూ.గో. జిల్లాలో 19 సీట్లకు గాను NDA కూటమి 14- 15 గెలుస్తుందని బిగ్‌టీవీ సర్వే తెలిపింది. 4-5 సీట్లు వైసీపీ సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తంమీద 175 అసెంబ్లీ సీట్లకు గాను 106- 119 కూటమి, 56- 69 సీట్లు వైసీపీ విజయం సాధిస్తుందని వెల్లడించింది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో కూటమి 15 నుంచి 17 స్థానాల్లో, వైసీపీ 2- 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోస్ట్‌పోల్ సర్వే తెలిపింది. మరోవైపు జిల్లాలోని అమలాపురం పార్లమెంట్ స్థానంలో టీడీపీ, రాజమండ్రి నుంచి బీజేపీ, కాకినాడ నుంచి జనసేన గెలవనున్నట్లు చాణక్య ఎక్స్ అంచనా వేసింది.
ఓట్ల పండగ ముగిసినప్పటి నుంచి ఊరు.. వాడా ఎక్కడ చూసినా ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టీ నెలకొంది. కాగా ఉమ్మడి తూ.గో.లోని 19 స్థానాలకు సంబంధించి పలు సర్వే సంస్థలు ఫలితాలను అంచనావేశాయి. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ కూటమికి 15, వైసీపీకి 3 వస్తాయని, కేకేసంస్థ టీడీపీ- 9, జనసేన- 6 గెలుస్తాయని సర్వేలో పేర్కొన్నాయి. ఇదే తుది ఫలితం కాకపోయినప్పటికీ ఓ అంచనా వచ్చేందుకు దోహదపడుతోంది.
– ఇంతకీ మీ అంచనా ఏంటి..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి KK సర్వే ఫలితాలు వెల్లడించింది. మొత్తం 19 స్థానాలకు గాను టీడీపీ-12, జనసేన- 5, బీజేపీ- 1, వైసీపీ- 1 చోట గెలవనుందని పేర్కొంది. కాగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
– మీ కామెంట్ ఏంటి..?
Sorry, no posts matched your criteria.