India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు పోయాయని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ధ్వజమెత్తారు. స్థానిక గోరక్షణ పేట దగ్గర వాటర్ వర్క్స్ మరమ్మతుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు వేసి, రోడ్డు డైవర్షన్ కూడా పెట్టలేదన్నారు. దీంతో బైక్‌పై వెళ్తున్న విజయ్ అనే యువకుడు అర్ధరాత్రి పైపును ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.

దొంగతనం చేసి పారిపోతూ కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహనరావు తెలిపారు. స్కార్పియోను దొంగతనం చేసి విజయవాడ పారిపోతున్నారనే సమాచారంతో కొవ్వూరు దగ్గర మన్ బ్రిడ్జి టోల్‌ప్లాజా సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాంబాబు, హెచ్‌సీ లక్ష్మీనారాయణలకు చెప్పారు. వారు అడ్డుకునే క్రమంలో రాంబాబును ఢీకొట్టి పారిపోయారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ భాగంగా శనివారం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ విభాగాలలో 2,439 మందికి 2,378మంది హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ లో 1940 మందికి 1908 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ ఐ ఓ పేర్కొన్నారు.

బర్డ్ ఫ్లూ వచ్చిందనే కారణంగా చికెన్ దుకాణాలు చాలా వరకు మూసివేశారు. దీంతో వాటి ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు లైవ్ కిలో రూ.120 ఉండగా అది ప్రస్తుతం రూ.80 నుంచి 90 వరకు ఉంది. ఫారం కోడి ధర లైవ్ రూ.90 పలుకగా ఇప్పుడు రూ.70 అమ్ముతున్నారు. వైద్యులు ఉడకబెట్టిన చికెన్ తినవచ్చు అని చెప్పినా ప్రజలు మొగ్గుచూపడం లేదు.

విద్యుదాఘాతానికి గురై ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన వేములపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ పీ.దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం..తూ.గో జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడికి చెందిన చిటికెన రామకృష్ణ (55) వేములపల్లి ఆయిల్ ఫ్యాక్టరీలో లోడ్ చేసి ట్యాంకు పైకి ఎక్కి శుభ్రం చేసే సమయంలో 33కేవీ విద్యుత్ వైరు తగిలి షాక్‌కు గురై మృతిచెందాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం జనసేన సన్నాహక సమావేశం ఆదివారం 03.00 గంటలకు రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్‌లో జరుగుతుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌లు పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రరతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని ఇంకుడు గుంటలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అప్పలరాజు, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే నాగేంద్ర (5) ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతి చెందిన విద్యార్థి కోరుకొండలో ప్రైవేట్ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈ సంఘటనతో వెదురుపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.

గులియన్ బారే సిండ్రోమ్ ఉమ్మడి గోదావరి జిల్లాలను తాకింది. ఇప్పటివరకు కాకినాడ GGHలో 16 కేసులు, రాజమండ్రి GGHలో ఓ కేసు నమోదైంది. ప.గోకు చెందిన వ్యక్తి ప్రస్తుతం కాకినాడలో చికిత్స పొందుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కాళ్లు, చేతులు తిమ్మిర్లు, కండరాల నొప్పులు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. వ్యాధి ముదిరిన దశలో అవయవాలు చచ్చుబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.