EastGodavari

News May 30, 2024

మట్టపర్రులో దర్శకుడు సుకుమార్ సందడి

image

ప్రముఖ దర్శకుడు, పుష్ప-2 దర్శకుడు సుకుమార్ తన స్వగ్రామం రాజోలు మండలం మట్టపర్రులో గురువారం సందడి చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సొంత ఊరుకు వచ్చిన సుకుమారుడు పలువురు అభిమానులు కలిసి ఆయనతో సెల్ఫీలు దిగారు. అభిమానుల రాకతో సుకుమార్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు విడుదల చేసిన పుష్ప-2 చిత్రంలోని రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయని పలువురు అభిమానులు సుకుమార్ కు అభినందనలు తెలిపారు.

News May 30, 2024

స్వేచ్ఛగా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

స్వేచ్ఛాయుతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలకు కాట్రేనికోన మండలం చేయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తామన్నారు.

News May 30, 2024

తూ.గో: విషాదం.. పాల ప్యాకెట్ కోసం వెళ్లి మృత్యువాత

image

పాల ప్యాకెట్ కోసం బైక్‌పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్‌పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 30, 2024

తూ.గో: ‘నేను గెలుస్తానా..? లేదా..? చెప్పండి’

image

జూన్ 4 కోసం అభ్యర్థులు, ప్రజల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కౌంటింగ్‌కు మరో 4రోజులే గడువు ఉండగా ఉమ్మడి తూ.గో జిల్లాలో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పోలింగ్ తర్వాత విహారయాత్రలకు వెళ్లిన అభ్యర్థులు, నేతలు తిరిగి ఇళ్లకు చేరుతున్నారు. ఎవరికి వారు సర్వేలు చేయించుకున్నప్పటికీ ఓటరు నాడీ పట్టలేక న్యూమరాలజీ, జ్యోతిషం చెప్పవారిని ఆశ్రయిస్తున్నారు. ‘నేను గెలుస్తానా లేదా చెప్పండి’ అంటూ స్పష్టత తీసుకుంటున్నారట.

News May 30, 2024

పిఠాపురం ఫలితంపై నా యావదాస్తి పందెం వేస్తా: వర్మ

image

‘పిఠాపురంలో పవన్ మంచి మెజార్టీతో గెలుస్తారని నా యావదాస్తి పందెం వేస్తా. ఎవరైనా ఉంటే కాగితాలతో రమ్మనండి’ అంటూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ ఓ ఛానల్ డిబెట్‌లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ తాము గెలుస్తున్నట్లు ఎక్కడా చెప్పడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందన్న విషయంపై వర్మ స్పందిస్తూ.. గెలిచే వారెప్పుడూ సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంటారని, ఓడిపోయే వారే హడావుడి చేస్తారని అన్నారు.

News May 30, 2024

కోనసీమ: రికార్డు స్థాయిలో ‘పనస’ విక్రయాలు

image

కోనసీమ జిల్లా అంటే గుర్తొచ్చేవి కొబ్బరి తోటలు. వీటి మధ్యే అంతర్ పంటగా వేసే ‘పనస’ సైతం మంచి దిగుబడితో లాభాలు తెచ్చిపెడుతోంది. అంబాజీపేట మార్కెట్‌కు రోజూ 500-700లకు పైగా పనసకాయలు వస్తుంటాయి. జిల్లా నుంచి HYD, ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈఏడాది జిల్లాలో 79.36 ఎకరాల్లో సాగు కాగా.. ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. 10-15 కాయలు కాసే చెట్టుకు ఈసారి 25 కాసినట్లు రైతులు చెబుతున్నారు.

News May 30, 2024

దారుణం.. మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంబాజీపేట మండలం చిరుతపూడి శివారు కట్టావారిపాలెంకు చెందిన మానసిక దివ్యాంగురాలు(25) ఈనెల 26న అమ్మవారి జాతర నేపథ్యంలో ఇంట్లోంచి బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించిన పాటియ్య(55) ఆమెను పక్కన ఉన్న తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేకలు విన్న ఇతర మహిళలు వెళ్లి ఆమెను బయటకు తీసుకువచ్చారు.తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 30, 2024

తూ.గో: సైన్స్ పరీక్షకు 3,730 మంది హాజరు

image

తూర్పు గోదావరి జిల్లాలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలో భాగంగా బుధవారం సైన్స్ పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా సైన్స్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లాలో 6,575 మంది విద్యార్థులకు గాను 3,730 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని డీఎస్ ఈఓ వాసుదేవరావు తెలిపారు. 2,840 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు.

News May 30, 2024

చివరిగా వెలువడేది ‘కొత్తపేట’ ఫలితం!

image

ఓట్ల లెక్కింపు రోజున ఉమ్మడి తూ.గో జిల్లాలో చివరి ఫలితం కొత్తపేట నియోజకవర్గం నుంచి వెలువడనుంది. 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కార్యాచరణ చేపట్టారు. అత్యధిక ఓట్లు నమోదైన కొత్తపేట నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో 2,52,383 మంది ఓటర్లకు గాను 2,14,975 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఓట్ల లెక్కింపునకు మొత్తం 26 రౌండ్లు నిర్ణయించారు.

News May 30, 2024

తూ.గో.: కూటమి అభ్యర్థి గెలవాలని పాదయాత్ర

image

తూ.గో. జిల్లా రాజానగరం నియోజకవర్గ MLAగా కూటమి(జనసేన) అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపొందాలని జనసేన అభిమాని వివేక్ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నాడు. ఈ మేరకు మొక్కు చెల్లించుకునేందుకు రాజానగరం నుంచి బుధవారం పాదయాత్రగా బయలుదేరాడు.