India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం 2.86 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 14, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని చెప్పారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.60 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని వివరించారు.
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై కేసు నమోదుచేసినట్లు సమిశ్రగూడెం SI రమేశ్ తెలిపారు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం జడ్పీ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగమణి రాజు కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కొందరు అతనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఆ మేరకు విచారణ చేసి సస్పెండ్ చేశారు. HM లలితారమణి ఫిర్యాదుతో కేసు నమోదుచేశారు.
కాకినాడలో గురువారం ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు గురువారం ఉదయం 10:00కు కాకినాడ కలెక్టరేట్ నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు వివిధ కళారూపాలతో భారీ ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పాల్గొంటారని తెలిపారు.
ఈనెల 24న కాకినాడలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటల నుంచి ఈ జాబ్ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు.
కోనసీమ జిల్లా వానపల్లికి ఈనెల 23న రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గ్రామసభ కార్యక్రమాన్ని చంద్రబాబు వానపల్లి వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఆ గ్రామంలో అనుకూలమైన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం పరిశీలించారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రవేట్ వసతి గృహాల నిర్వాహకులు తగిన అనుమతులు లేకుండా నిర్వహణా చెయ్యడం, పిల్లల సంరక్షణ కేంద్రాల మార్గదర్శకాలు పాటించకుండా నిర్వహణా వ్యవస్థ ఉండటం గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖల అధికారులు వసతి గృహాలను, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, పిల్లల సంరక్షణ వసతి గృహాలను తన ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక డీఎస్పీని బదిలీ చేశారు. మరో ఇద్దరు డీఎస్పీలను నియమిస్తూ ఏలూరు రేంజ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి ఎస్బీ డీఎస్పీ డి.ప్రభాకర్‌ను పలమనేరు బదిలీ చేశారు. అమలాపురం డీఎస్పీగా టీఎస్ఆర్ కే.ప్రసాద్‌ను నియమించారు. కాకినాడ డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
శ్రావణమాసంలో ఈ నెల 22, 23 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో 2 రోజులు పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో వెయ్యి వరకు వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో రెండు రోజుల్లో 200 వివాహం జరగనున్నాయి. 22వ తేదీ 92, 23న 87 వివాహాలకు ఇప్పటికే మండపాలు బుక్ చేసుకున్నారు. ఇవి కాక మరో 50 వరకు వివాహాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. దీంతో పెళ్లిళ్ల కోలాహలం మొదలైంది.
తుని RTC డిపో ఒక్కరోజులో రూ.13.86 లక్షలు ఆదాయంతో 105% ప్రయాణికులతో రికార్డు సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో ఆక్యూపెన్సి రేషియోలో మొదటి స్థానంలో నిలిచింది. వరుస సెలవులు, శ్రావణం, రాఖీ పౌర్ణమి, వివాహముహూర్తాలతో సోమవారం బస్సులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. తుని డిపో నుంచి నిత్యం 72 బస్సులను కాకినాడ, రాజమండ్రి, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు నడుపుతారు. రద్దీదృష్ట్యా నిన్న మరో 6 బస్సులు అదనంగా తిప్పారు.
Sorry, no posts matched your criteria.